News


నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th November 2019
Markets_main1573889037.png-29644

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ నష్టంతో ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 11942.60తో పోలిస్తే 16.60 పాయింట్లు నష్టంతో 11,926.00 వద్ద స్థిరపడింది. ఇక ఈవారంలో మార్కెట్‌ నాలుగు రోజులు మాత్రమే పనిచేసింది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావితం చేసే అంశాలేమి లేకపోవడం, దేశీయంగా సెప్టెంబర్‌ మాసపు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలతో పాటు అక్టోబర్‌ ఎగుమతులు క్షీణించడంతో ఈ వారం ఆద్యంతం సూచీలు పరిమితి శ్రేణిలో కదలాడాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 33.08 పాయింట్లు, నిఫ్టీ 12.65 పాయింట్ల స్వల్ప లాభాన్ని ఆర్జించాయి. ఇదే వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.321.30కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ)లు రూ. 514.61 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మారు. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వారం మొత్తం మీద 50 పైసలు నష్టపోయి 71.78 వద్ద ముగిసింది. 

వచ్చే వారంలో నిఫ్టీ-50 అవుట్‌లుక్‌:- 
నిఫ్టీ-50 ఇండెక్స్‌ శుక్రవారం ఆరంభలాభాల్ని కోల్పోయి 23 పాయింట్లు లాభంతో ప్రారంభ స్థాయి 11,895 వద్ద ముగిసింది. ఈ వారంలో నిఫ్టీ 171 పాయింట్ల రేంజ్‌లో ట్రేడైంది. ఈ క్రమంలో ఇండెక్స్‌ డైలీ చార్ట్‌లో డోజో క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. వీక్లీ ఛార్ట్‌లో ఇండెక్స్‌ ఇండిసివ్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. 11850 స్థాయి ముగింపు అప్‌సైడ్‌ ట్రెండ్‌ను సూచిస్తుంది. అప్‌సైడ్‌ ట్రెండ్‌ కొనసాగితే 11950 వద్ద నిరోధ స్థాయిని పరీక్షిస్తుంది. డౌన్‌సైడ్‌ ట్రెండ్‌లో 11,780 కీలక మద్దతు స్థాయిని కలిగింది. 

మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు:- 
అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటర్స్‌,  ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో ఏడీఆర్‌లు లాభపడగా వేదాంత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ 2.86 శాతం లాభపడి 11.86డాలరు వద్ద స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.10శాతం పెరిగి 13.74 వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌ అరశాతం లాభంతో 38.50డాలర్ల వద్ద, విప్రో ఏడీఆర్‌ పావుశాతం ర్యాలీ చేసి 3.87డాలరు వద్ద ముగిశాయి. వేదాంత ఏడీఆర్‌ అరశాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 0.20శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.10శాతం నష్టపోయాయి. You may be interested

ఎస్సార్‌ స్టీల్‌..ఏయే బ్యాంకులకు ఎంతొస్తుంది?

Saturday 16th November 2019

సుప్రీం కోర్టు తీర్పు వలన ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు దాఖలైన రూ. 42,000 కోట్ల బిడ్‌లో సుమారుగా 92 శాతం వాటాను, ఈ కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు పొందనున్నాయి. ఎస్సార్‌ స్టీల్‌కు రుణాలిచ్చిన ఆపరేషనల్‌ రుణ దాతలు రూ. 1,196 కోట్లను పంచుకోనున్నారు. ఫలితంగా బ్యాంకుల డిసెంబర్‌ క్వార్టర్‌ లాభాల దృక్పథం మెరుగవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అనేక దివాలా కేసులను తొందరగా పరిష్కారించేందుకు వీలు కుదిరిందని తెలిపారు.    

అధిక వాల్యూషన్లతో ఆటు పోట్లు!

Saturday 16th November 2019

జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ దేశీయ బ్లూచిప్‌ స్టాకుల్లో ప్రీమియం వాల్యూషన్లున్నాయని, ఇందువల్ల షార్ట్‌టర్మ్‌కు మార్కెట్లో ఆటుపోట్లు తప్పకపోవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. వాల్యూషన్లకు ఎర్నింగ్స్‌కు మధ్య వ్యత్యాసం తాజా ర్యాలీ అనంతరం పెరగడంతో స్వల్పకాలానికి మార్కెట్‌ ట్రెండ్‌ ఒడిదుడుకులతో ఉండొచ్చని చెప్పారు. అంతర్జాతీయ దేశీయ సానుకూల వార్తలు ఈక్విటీల్లో ర్యాలీ తెచ్చాయన్నారు. వారాంతానికి ఇండియా రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ వార్తలో ప్రాఫిట్‌బుకింగ్‌ వచ్చిందన్నారు.

Most from this category