News


ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th November 2019
Markets_main1573277007.png-29473

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ప్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11945.35 తో పోలిస్తే 5పాయింట్ల లాభంతో 11,950.50 వద్ద స్థిరపడింది. భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను మూడీస్‌ తగ్గించడంతో పాటు సూచీల లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో  రెండు రోజుల రికార్డ్‌ ముంగింపు లాభాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 330 పాయింట్ల నష్టంతో 40,324 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 11,908 పాయింట్ల వద్దకు చేరింది. ఈ వారంలో మొత్తం ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైలను తాకింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్‌ 159 పాయింట్లు, నిఫ్టీ 18 పాయిట్లు చొప్పున పెరిగాయి. 
వచ్చేవారంలో మార్కెట్‌ను ప్రభావితం చేయగల అంశాలు:- 

సోమవారం అక్టోబర్‌ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదల కానున్నాయి. మంగళవారం(నవంబర్‌ 12) గురునానక్‌ జయంతి సందర్భంగా మార్కెట్‌కు సెలవు. కాబట్టి వచ్చే వారంలో మార్కెట్‌ ట్రేడింగ్‌ 4రోజులు మాత్రమే పనిచేస్తుంది. గురువారం (నవబంబర్‌ 14) రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదల కానున్నాయి. అదే వారంలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టైన సుమారు 2800 కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. నిఫ్టీ ఇండెక్స్‌లో లిస్టైన బ్రిటానియా ఇండస్ట్రీస్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, మదర్‌సుమీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఎండీసీ కంపెనీలు సోమవారం ఫలితాలను ప్రకటించనున్నాయి. నేడు ఎన్‌టీపీసీ, ఐఓసీ కంపెనీలు క్యూ2 ఫలితాలను ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా... అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చల అంశం, ముడిచమురు ధరల ట్రేడింగ్‌ అంశాలు కీలకం కానున్నాయి. దేశీయ విషయానికోస్తే మూడీస్‌ రేటింగ్‌ సంస్థ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌తో పాటు 17 కంపెనీలపై అవుట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఇండియా ఫ్యూయల్‌ డిమాండ్‌ వృద్ధి 6ఏళ్ల కనిష్టాన్ని తాకింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్‌, ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్‌ తీరును ప్రభావితం చేయగలవు.You may be interested

తాజా ర్యాలీతో మళ్లీ పెరిగిన వాల్యూషన్లు

Saturday 9th November 2019

జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ రెండు నెలలుగా మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ విస్తృతమైనదని, దీని కారణంగా తిరిగి మార్కెట్లలో వాల్యూషన్లు పెరిగిపోయాయని జియోజిత్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. తాజా ర్యాలీ దాదాపు అన్ని రకాల షేర్ల(లార్జ్‌, మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌)లో కనిపించిందన్నారు. నిఫ్టీ తదితర సూచీలు దాదాపు 11- 12 శాతం మేర రాణించాయని దీంతో వాల్యూషన్లు ప్రీమియం స్థాయిలకు చేరుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బ్లూచిప్స్‌, లార్జ్‌

బంగారం ధర మరింత తగ్గుతుందా?

Saturday 9th November 2019

బంగారం ధరలు గత కొద్దిరోజుల నుంచి 1,520-1,485 డాలర్ల శ్రేణిలో కదులుతున్నాయి. గోల్డ్‌ బుల్స్‌ తదుపరి ర్యాలీ కోసం వేచి చూస్తున్నప్పటికి యుఎస్‌-చైనా మధ్య ట్రేడ్‌వార్‌ ముగిసే సూచనలు కన్పిస్తుండటంతో, ఈ ర్యాలీ ఆలస్యమవుతోంది. అయినప్పటికీ ప్రస్తుతం బంగారం ధరలు వాటి 200 డీఎంఏ స్థాయికి చాలా ఎగువనే ట్రేడవుతున్నాయి. కానీ యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ముగిస్తే బంగారం ధరలు పడిపోడానికి అవకాశం ఉంది. డాలర్‌ బలహీనంగా ఉన్నప్పటికి, యుఎస్‌ ఆర్థిక డేటా బలంగా ఉండడం, వాణిజ్య

Most from this category