News


ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 19th October 2019
Markets_main1571466191.png-29002

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11670.00 పాయింట్లతో పోలిస్తే అర పాయింటు నష్టంతో 11,669.50 నష్టంతో ఉంది. ఇక వచ్చేవారంలో స్టాక్‌ మార్కెట్ 4రోజులు మాత్రమే పనిచేస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో సోమవారం(21న) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. నిన్నటి రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 246 పాయింట్ల లాభంతో 39,298 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 76 పాయింట్లు ఎగసి 11,662 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇప్పటివరకూ వెల్లడైన ప్రధాన కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు బాగానే ఉండటం,  దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం,  పండుగ సీజన్‌, ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు, అంతర్జాతీయ సానుకూల సకేంతాలకు తోడు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన  ఉద్దీపన చర్యలతో ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహనం తదితర అంశాలతో ఈ వారంలో సెన్సెక్స్‌ 1171 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 356 పాయింట్లు పెరిగింది.
వచ్చేవారం క్యూ2 ఫలితాలు కీలకం:- 
వచ్చేవారంలో కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు దిశా నిర్దేశం కానున్నాయి.  ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో ప్రధాన కంపెనీల ఫలితాలు కీలకం కానున్నాయి. నేడు ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మంగళవారం యాక్సిస్‌ బ్యాంక్‌, బుధవారం కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, శుక్రవారం ఎస్‌బీఐ, శనివారం ఐసీఐసీఐ బ్యాంక్‌ రెండో క్వార్టర్‌ ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇండెక్స్‌లో అధిక పరిమాణం కలిగిన ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ, కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 24న ఫలితాలు ప్రకటించనున్నాయి. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌ రూపాయి ట్రేడింగ్‌, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్‌కు కీలకం కానున్నాయి. ఇక అంతర్జాతీయంగా బ్రెగ్జిట్‌ అంశం, అమెరికా.. చైనా మధ్య వాణిజ్య ఒప్పందం, ముడిచమురు ధరలు మార్కెట్‌ను సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలవు. 



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై బ్యాంకుల ప్రతిపాదనకు ఆర్‌బీఐ ‘నో’

Saturday 19th October 2019

-డిసెంబర్‌ త్రైమాసికంలో తగ్గనున్న బ్యాంకుల లాభాలు   దివాన్‌ హౌసింగ్‌ పైనాన్స్‌కు(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రుణాలిచ్చిన బ్యాంకులు, రూ. 6,000 కోట్ల వరకు ప్రొవిజన్ల ఉపశమనాన్ని పొందేందుకు సిద్ధంచేసిన ప్రతిపాదనలను ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తిరస్కరించిందని పరిశీలకులు తెలిపారు. ఫలితంగా డిసెంబర్‌ త్రైమాసికానికిగాను ఈ బ్యాంకుల లాభం తగ్గనుంది. బ్యాంకులు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించి మొత్తంగా రూ. 40,000 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివున్నాయి. అందువలన ఈ రుణదాతలు డిసెంబర్‌ త్రైమాసికం చివరినాటికి 15 శాతం

12,000 స్థాయికి నిఫ్టీ, టాప్‌ స్టాక్‌ సిఫార్సులు!

Saturday 19th October 2019

-కొటక్‌ సెక్యురిటీస్‌, శ్రీకాంత్‌ చౌహాన్‌ తాజాగా మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తే నిఫ్టీ 11,800, 12,000 స్థాయిల వద్ద గరిష్ఠాలను ఏర్పరిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని కోటక్‌ సెక్యురిటీస్‌, సాంకేతిక విశ్లేషకులు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. మార్కెట్‌లో బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగుతుంది... గరిష్ఠ స్థాయిలయిన 12,103, 11,981, 11, 695 స్థాయిలను కలుపుతున్న ‘పడుతున్న ట్రెండ్‌ లైన్‌’ను తాజాగా నిఫ్టీ క్రాస్‌

Most from this category