News


లాభంతో ముగిసిన ఎస్ఎజీఎక్స్‌ నిఫ్టీ

Saturday 21st September 2019
Markets_main1569046494.png-28468

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి లాభంతో ముగిసింది.  ఇది 11,327.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11295.50 పాయింట్లతో పోలిస్తే 31పాయింట్ల లాభంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ లాభంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మందగమన భయాలతో ఇటీవల భారీ పతనాన్ని చవిచూస్తున్న మార్కెట్లో జోష్‌ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ఒక్కరోజులోనే సెన్సెక్స్‌ 1,921 పాయింట్లు, నిఫ్టీ 556 పాయింట్లు పెరిగాయి. వారం వారీగా చూస్తే సెన్సెక్స్‌ 630 పాయింట్లు, నిఫ్టీ 198 పాయింట్లు లాభపడ్డాయి. 
వచ్చేవారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు:-
సెప్టెంబర్‌ నెల డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారం(26న) ముగియనుండంతో ట్రేడర్లు పొజిషన్లను అక్టోబర్‌ సిరీస్‌కు రోలోవర్ చేసుకుంటున్న నేపథ్యంలో మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది.వాటితో పాటు సాధారణ అంశాలపై రూపాయి, ముడిచమురు ధరల ట్రేడింగ్‌, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు, కొనుగోళ్లు... తదితర అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. 



You may be interested

ట్యాక్స్‌ కట్‌తో భారీగా లాభపడే కంపెనీలివే!

Saturday 21st September 2019

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 22 శాతానికి (సెస్‌, సర్‌చార్జీలు కలిపి 25.17) తగ్గించి మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చర్యకు ముందు, రూ. 400 కోట్ల వార్షిక టర్నోవర్‌ కలిగిన కంపెనీలు 30 శాతం( సెస్‌, సర్‌చార్జీలతో కలిపి 34.944 శాతం) కార్పోరేట్‌ ట్యాక్స్‌ను, టర్నొవర్‌ రూ. 400 కోట్లు లోపు ఉన్న దేశీయ కంపెనీలు 25 శాతం(సెస్‌, సర్‌చార్జీలతో కలిపి 29.12 శాతం)

డిసెంబర్‌కల్లా నిఫ్టీ టార్గెట్‌ 12,200

Saturday 21st September 2019

 ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో, ఆర్థిక సంవత్సరం 2020 కి గాను ద్రవ్యలోటు 3.7 శాతానికి పెరిగే అవకాశం ఉందని యెస్‌ సెక్యురిటీస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అమర్‌ అంబానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు.. నిఫ్టీ వృద్ధి అంచానాలు పెరిగాయి.. ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి అతి పెద్ద ఉద్దీపనాన్ని అందించింది. అంతేకాకుండా మ్యాట్‌(మినిమమ్‌ ఆల్టర్‌నేటివ్‌ ట్యాక్స్‌)ను 18

Most from this category