News


నష్టాల్లో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 28th September 2019
Markets_main1569661924.png-28603


విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి నష్టంతో ముగిసింది. ఇది 11,531.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11579.50 పాయింట్లతో పోలిస్తే 48 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద ఆశలు సన్నగిల్లడం తదితర కారణాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతీయడంతో శుక్రవారం సెన్సెక్స్‌ 167.17 పాయింట్లు నష్టపోయి 39000 దిగువున 38,822.57 వద్ద స్థిరపడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 59 పాయింట్లు కోల్పోయి 11500 స్థాయి కింద 11,512.40 వద్ద ముగిసింది. 

క్రితం వారాంతంలో కేంద్రం ప్రకటించిన టాక్స్‌ కట్‌తో ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 717 పాయింట్లు, నిఫ్టీ 268 వద్ద పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన 4వారాల్లో  ఈ వారంలోనే సూచీలు అత్యధికంగా లాభాలను ఆర్జించాయి.  బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫ్లాట్‌గానూ, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.3శాతం లాభంతో ముగిశాయి. 

వచ్చేవారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు:-
వాహన కంపెనీలు మంగళవారం సెప్టెంబర్‌ నెల వాహన విక్రయ గణాంకాలు ప్రకటించనున్నాయి. గాంధీ జయంతి(అక్టోబర్‌ 2) సందర్భంగా బుధవారం మార్కెట్‌ పనిచేయదు. కాబట్టి మార్కెట్‌ 4రోజులు మాత్రమే పనిచేస్తుంది. గురు, శుక్రవారాల్లో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన నాలుగో ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షను మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) చేపట్టనుంది. నిర్ణయాలను ఆర్‌బీఐ శుక్రవారం(అక్టోబర్‌ 4న) ప్రకటించనుంది. ఈసారి కూడా వడ్డీరేట్లకు కీలకమైన రెపో రేటును తగ్గించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.  ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే... అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాదాలతో అమెరికా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌పై ఆ దేశ ప్రధాన పక్షం డెమోక్రటిక్‌ పార్టీ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మాన అంశం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలదు. వీటితో పాటు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి ట్రేడింగ్‌,  దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు, కొనుగోళ్లు... తదితర అంశాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయి. 

 You may be interested

టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2.50శాతం డౌన్‌

Saturday 28th September 2019

అమెరికా మార్కెట్లు రెండునెలల్లో అతిపెద్ధ నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఏడీఆర్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 2.50శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్‌ ఏడీఆర్‌ 2.50శాతం నష్టపోయింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 2శాతం, ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1.50శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌ అరశాతం క్షీణించాయి.

ఐఆర్‌సీటీసీ ఐపీఓ: విశ్లేషకుల అభిప్రాయమిదే..!

Saturday 28th September 2019

సోమవారం ప్రారంభం కానున్న ఇష్యూ  ప్రభుత్వ రంగ ఇండియన్‌ కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ సోమవారం ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 3న ముగుస్తుంది.  ఐపీఓ ధర శ్రేణి రూ.315–320గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఇష్యూ సైజు రూ.645 కోట్లు. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 2.01 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఈ మొత్తంలో ఉద్యోగులకు 1,60,000 షేర్లను కేటాయించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు,

Most from this category