News


11850పై ఎస్‌జీఎక్స్‌ ముగింపు

Saturday 29th June 2019
Markets_main1561787504.png-26683

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 11850పై ముగిసింది. సింగపూర్‌ మార్కెట్లో నిన్న రాత్రి 16.50 పాయిం‍ట్ల లాభంతో 11,854.50 వద్ద ముగిసింది. నేడు జీ-20 సదస్సులో అమెరికా- చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలమవుతాయనే ఆశావహనంతో నిన్న యూరప్‌ మార్కెట్లతో అమెరికా మార్కెట్లు సైతం లాభంతో ముగిశాయి. అమెరికాలోని ప్రధాన ఇండెక్స్‌ నాస్‌డాక్‌ 39 పాయింట్లు లాభపడి 8000 స్థాయిపై 8,006.24 వద్ద, డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఇండెక్స్‌ 73.38 పాయింట్లు పెరిగి 26,600 వద్ద, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 17 పాయింట్లు పెరిగి 2,941.76 వద్ద ముగిసాయి 
టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2శాతం డౌన్‌:- 
అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌) గతరాత్రి మిశ్రమంగా ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌డీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.75శాతం లాభపడ్డాయి. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ అత్యధికంగా 2శాతం నష్టపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ అరశాతం, ఐసీసీఐ బ్యాంకు ఏడీఆర్‌ 0.10శాతం, విప్రో ఏడీఆర్‌ అక్కడిక్కడే ముగిసింది.



You may be interested

అమెరికా-చైనా మధ్య సంధి

Saturday 29th June 2019

గత కొన్ని రోజుల నుంచి అందరి దృష్ఠిని ఆకర్షిస్తున్న  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల సమావేశం సానుకూలంగా జరిగినట్టు తెలుస్తోంది. చైనాతో వాణిజ్య చర్చలు తిరిగి ట్రాక్‌లోకి వచ్చాయని ట్రంప్‌ అనడం గమనార్హం. శనివారం జరిగిన ‘అద్భుతమైన’ చర్చల తర్వాత వాషింగ్టన్‌  చైనా ఉత్పత్తులపై విధించనున్న కొత్త సుంకాలను ఆపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  రెండు కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మధ్య  వాణిజ్య యుద్ధం

బడ్జెట్‌ ముందు ఈ స్టాక్‌లను పరిశీలించవచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీష్‌

Saturday 29th June 2019

ఆకర్షిస్తున్నా స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విజిబులిటీ ఉంది సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విజిబులిటీ ఉందని, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ల వాల్యుషన్లు ఆకర్షిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ హెడ్‌ వీకే శర్మ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... వాస్తవిక అంచనాలు.. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చాక తీసుకొస్తున్నా మొదటి బడ్జెట్‌ కావడంతో దీనిపై అందరూ దృష్ఠి

Most from this category