ఇంకా భారీ డిస్కౌంట్లోనే చాలా షేర్లు!
By D Sayee Pramodh

నిఫ్టీ వాల్యూషన్లు మాత్రం చాలా ఎక్కువ
అందువల్ల మరికొంత కాలం ఆటు పోట్లు తప్పవు
సిద్ధార్ధ కేమ్కా అంచనాలు
నిఫ్టీలో ఇంకా పలు స్టాకులు తమతమ దీర్ఘకాలిక సరాసరి వాల్యూషన్ల కన్నా 30- 40 శాతం తక్కువకు ట్రేడవుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రిసెర్చ్ హెడ్ సిద్ధార్ధ కేమ్కా చెప్పారు. అయితే నిఫ్టీ మాత్రం 20 రెట్లు పీఈతో ట్రేడవుతూ అధిక వాల్యూషన్ల వద్ద ఉందన్నారు. అందువల్ల స్వల్పకాలానికి సూచీలు ఒడిదుడుకులను చూస్తాయన్నారు. ఎకనమిక్ రికవరీ స్పష్టంగా కనిపించేవరకు సూచీల్లో ఆటుపోట్లు తప్పవన్నారు. ఇటీవల కాలంలో సెంటిమెంట్లు పాజిటివ్‌గా మారుతున్న సంకేతాలు కనిపించాయని, ఇవి నెగిటివ్ వార్తలను కొంత మేర అరికట్టాయని చెప్పారు. ఎకానమీ, ఎర్నింగ్స్‌కు సంబంధించిన మూలాలు బలోపేతం అవుతున్నాయన్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఎఫ్ఐఐల ప్రవాహం జోరందుకోవచ్చని అంచనా వేశారు. ఎకానమీలో పునరుజ్జీవం మరింత వేగవంతం కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి అని ఆయన చెప్పారు. విత్త రంగంలో ఒత్తిడిని తగ్గించడం, వినిమయ ప్రోత్సాహానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు ప్రకటించడం, యూఎస్- చైనా ట్రేడ్‌వార్ ముగింపునకు రావడం... అనే అంశాలు రికవరీకి కీలకమన్నారు. ప్రస్తుత మందగమన సమయంలో ఇన్వెస్టర్లు నాణ్యమైన స్టాకులను ఎంచుకొని దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
రాబోయే కాలంలో ప్రైవేట్ బ్యాంకులు, బీమా, కన్జూమర్, రిటైల్, మల్టీప్లెక్స్, హోటల్స్ రంగాలు మంచి పనితీరు కనబరచవచ్చని తెలిపారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న చర్యలతో వృద్ధి ఊపందుకుంటోదని, సెంటిమెంట్స్ మారుతున్నాయని తెలిపారు. అందువల్ల రాబోయే రోజుల్లో మిడ్‌క్యాప్స్, చిన్న స్టాకుల్లో విపరీత పతనం ఆగవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు క్రమంగా ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్ మంచి పురోగతి చూపవచ్చని అంచనా వేశారు.
You may be interested
ఒడిదుడుకుల ట్రేడింగ్: ఫ్లాట్ ముగింపు
Friday 25th October 2019ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి దాదాపు ఫ్లాట్ ముగిశాయి. సెన్సెక్స్ 37.67 పాయింట్ల లాభంతో 39,058.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1.30 పాయింట్ల లాభంతో 11,583.90 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, మీడియా, ఆర్థిక, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, ఫార్మా, ఎఫ్ఎంజీసీ, అటో రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ షేర్లకు ర్యాలీతో ఎన్ఎస్ఈలో కీలకమై బ్యాంక్ నిఫ్టీ
ఇది సెంటిమెంట్‌ను మార్చే దీపావళి కాదు: యాక్సిస్ బ్యాంక్ చీఫ్
Friday 25th October 2019-అమితాబ్ చౌదరి, యాక్సిస్ బ్యాంక్ ‘ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నెగిటివ్ సెంటిమెంట్, పండుగ సీజన్ వలన తొలుగుతుందని అనుకోవడం లేదు’ అని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ అమితాబ్ చౌదరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్బీఎఫ్సీ(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్)లు ఆస్తి నాణ్యత సమస్యలను, లిక్విడిటీ కొరతను ఎదుర్కొంటున్నాయని, ఈ రంగలో 12-18 నెలల లోపు చెప్పుకోదగ్గ మార్పులను అంచనావేయోద్దని సూచించారు. మిగిలిన ముఖ్యమైన విషయాలు ఆయన