News


సెన్సెక్స్‌ లాభం 493 పాయింట్లు

Thursday 20th June 2019
Markets_main1561027515.png-26451

140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు
రాణించిన స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు 

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో మార్కెట్‌ గురువారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 490 పాయింట్ల 39,601 స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 11,831 వద్ద ముగిసింది. నిన్న రాత్రి అమెరికా కీలకవడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడటంతో ప్రపంచమార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ నెల చివరిన జీ-20 సదస్సులో అమెరికా - చైనాల మధ్య వాణిజ్య చర్చలు సఫలం కావవచ్చనే ఆశావహన అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడేందుకు సహకరించింది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం కూడా కలిసొచ్చింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నుడుమ నేడు మార్కెట్‌ నష్టంతో మొదలైంది. అయితే మధ్య, చిన్న తరహా షేర్లలో అనూహ్యంగా కొనుగోళ్లు నెలకొనడం, ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడటంతో మార్కెట్‌ ప్రారంభమైన గంటలోపే సూచీలు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, అటో, ఫైనాన్స్‌ రంగ షేర్లలో స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం క్రమంగా లాభాలను పెంచుకున్నాయి. యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం కూడా ఇన్వెస్టర్లుకు మరింత ఉత్సాహానిచ్చింది. ఈ క్రమంలో ఓ దశలో సెన్సెక్స్‌ 526 పాయింట్లు పెరిగి 39,112.74, నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 11,843.50 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. ఇంట్రాడేలో అన్ని రంగాలకు చెందిన షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 419 పాయింట్లు లాభపడి 30,781.10 వద్ద స్థిరపడింది. హెచ్‌1బీ వీసాల జారీపై పరిమితులు విధించే సన్నాహాలు చేస్తుందనే వార్తలతో ఐటీ షేర్లు ట్రేడింగ్‌ అద్యంతం అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్లు ఐటీ షేర్లను నష్టాల నుంచి గట్టెక్కించాయి. 
జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం లాభపడగా, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా, అదానీ పోర్ట్స్‌, విప్రో, యూపీఎల్‌ షేర్లు 1.50శాతం నుంచి 8.50శాతం నష్టపోయాయి.You may be interested

జూలైలో ఫెడ్‌ రేట్‌ కట్‌?!

Thursday 20th June 2019

 గోల్డ్‌మన్‌ సాక్స్‌ అంచనా యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంకు వచ్చే జూలై, సెప్టెంబర్‌లో వడ్డీరేట్లను తగ్గిస్తుందని గోల్డ్‌మన్‌సాక్స్‌ అనలిస్టులు తాజాగా అంచనాలు వేస్తున్నారు. నిజానికి గత అంచనాల్లో జూన్‌16నే ఫెడ్‌ రేట్‌ కట్‌ ఉంటుందని సంస్థ అభిప్రాయపడింది. అయితే తాజాగా తన అంచనాలను పునఃసమీక్షించుకుంది. ఫెడ్‌తో నేరుగా డీల్‌ చేసే 24 ప్రైమరీ డీలర్లలో గోల్డ్‌మన్‌ సాక్స్‌ ఒకటి. ఇతర నిపుణులు మాత్రం ఈ ఏడాది చివరకు మూడు సార్లు రేట్ల తగ్గింపు

అపోలో షేరును ఏంచేద్దాం!

Thursday 20th June 2019

అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌లో వాటాలను హెచ్‌డీఎఫ్‌సీకి విక్రయించాలన్న నిర్ణయం అపోలో హాస్పిటల్స్‌కు పాజిటివ్‌గా మారుతుందని బ్రోకింగ్‌సంస్థలు భావిస్తున్నాయి. డీల్‌పై, అపోలో షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు, అంచనాలు ఇలా ఉన్నాయి... 1. మోర్గాన్‌ స్టాన్లీ: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇస్తూ రూ. 1667 టార్గెట్‌ ధరగా నిర్ణయించింది. ఈ డీల్‌ ప్రధానమైన లిక్విడిటీ ఈవెంట్‌అని, దీనివల్ల కంపెనీ రుణాలు తీర్చేందుకు వీలవుతుందని తెలిపింది. మేనేజ్‌మెంట్‌ గైడెన్స్‌కు అనుగుణంగానే డీల్‌ ఉందని, తనఖాలు

Most from this category