News


11850పైన నిఫ్టీ ప్రారంభం

Tuesday 25th February 2020
Markets_main1582603132.png-32064

  • 134 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌ 
  • భారీ పతనం నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌
  • కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం


ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ వ్యాధి ప్రకంపనలతో నిన్నరాత్రి రోజున రెండు వారాల కనిష్టానికి పతమైన భారత మార్కెట్‌ మంగళవారం లాభంలో మొదలైంది. సెన్సెక్స్‌ 134 పాయింట్ల లాభంతో 40,497.72  వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 11,877.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి రోజున భారీ పతనాన్ని చవిచూసిన ఈక్విటీ మార్కెట్లో నేడు షార్ట్‌ కవరింగ్‌ జరపడటంతో పాటు  క్రూడాయిల్‌ ధరలు భారీ పతనం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. డాలర్‌ మారకంలో నిన్నటి ట్రేడింగ్‌ 3నెలల కనిష్టానికి పతనమైన రూపాయి 7పైసలు బలపడి 71.85 వద్ద ప్రారంభం కావడం కూడా మార్కెట్‌ కలిసొచ్చింది. అయితే ఆసియా మార్కెట్లలో ప్రధాన మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం మన మార్కెట్‌ ట్రేడింగ్‌ మీద కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో సూచీల లాభాలు క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. 

ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ నిన్నటి ముగింపు(40,363.23)తో పోలిస్తే 58 లాభంతో 40,421.81 వద్ద, నిఫ్టీ క్రితం ముగింపు(11,829.40)తో పోలిస్తే 21 పాయింట్ల లాభంతో 11850 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.  నిన్నటి ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూసిన మెటల్‌ షేర్లకు అత్యధికంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.11శాతం లాభంతో 30,487 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌, జీ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 0.75శాతం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

భారీగా తగ్గిన పసిడి ధర!

Tuesday 25th February 2020

గత ఐదురోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా రూ.584 తగ్గింది. కొద్ది రోజులుగా 10 గ్రాముల పసిడిపై రూ.3000 వరకూ పెరిగి రూ.43,900 కు కూడా చేరింది. మంగళవారం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో రూ.581 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.42,999.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో 18 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,659 డాలర్ల వద్ద ట్రేడ్‌

నేడు లాభాల ఓపెనింగ్‌ ?!

Tuesday 25th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 37 పాయింట్లు ప్లస్‌ నేడు నిఫ్టీకి 11,957 వద్ద రెసిస్టెన్స్‌! యూఎస్‌ మార్కెట్లు 2.6 శాతం పతనం  నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30  ప్రాంతం‍లో 37 పాయింట్లు పుంజుకుని 11,870 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,833 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి

Most from this category