News


రెండురోజుల పతనానికి బ్రేక్‌

Wednesday 18th September 2019
news_main1568802676.png-28410

ముడిచమురు ధరల పెరుగుదలతో రెండు రోజుల పాటు భారీ పతనాన్ని చవిచూసిన సూచీలు బుధవారం స్వల్పలాభంతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ 83 పాయింట్లు పెరిగి 36,564 వద్ద, నిఫ్టీ 23.05 పాయింట్ల పెరుగుదలతో 10,840.65 వద్ద స్థిరపడింది. తిరుగుబాటుదారుల డ్రోన్‌ దాడి నేపథ్యంలో తగ్గిన చమురు ఉత్పత్తిని నెలాఖరులో పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం, డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ తదితర సానుకూలాంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే రెండురోజుల మార్కెట్‌ పతనంతో వాల్యూ షేర్లు చౌకధరల్లో లభిస్తుండంతో ఆయా ఆయా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు స్థిరమైన ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 332 పాయింట్లు పెరిగి 36,713 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 10,885.15 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే... మిడ్‌సెషన్‌ అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో పాటు, నేటి రాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌బ్యాంక్‌ వడ్డీరేట్ల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో ఉదయం సెషన్‌లో సూచీలు ఆర్జించిన లాభాలు సగానికి పైగా హరించుకుపోయాయి. చివరికి నిఫ్టీ 23 పాయింట్ల పెరుగుదలతో, సెన్సెక్స్‌ 88 పాయింట్లు లాభంతో ముగిశాయి. మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌, ఫార్మా, మీడియా, అటో రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల పతనంలో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 41 పాయింట్లు లాభంతో 27,172.65 వద్ద స్థిరపడింది. 

ఎస్‌బీఐ, గెయిల్‌, వేదాంత, బీపీసీఎల్‌, టాటాస్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 3.70శాతం వరకు లాభపడ్డాయి.  ఐషర్‌మోటర్స్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, బ్రిటానియా షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. You may be interested

పెరుగుతున్న మాంద్యం భయాలు.. మన పరిస్థితేంటి..?

Thursday 19th September 2019

అంతర్జాతీయంగా మాంద్యం పట్ల భయాలు పెరుగుతున్నాయి. వర్ధమాన దేశాలతోపాటు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య తీవ్ర స్థాయిలో వాణిజ్య యుద్ధం నడుస్తుండడం, చమురు ధరల్లో అస్థిరతలు, మన దేశంపై ప్రభావం చూపించేవే. ఇప్పటికే మన దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జూన్‌ క్వార్టర్‌లో 5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. దీంతో మన ప్రభుత్వం

వాహనాలు, బిస్కెట్‌లపై జీఎస్‌టీ తగ్గింపు లేనట్టే?

Wednesday 18th September 2019

జీఎస్‌టీ రేట్లపై జీఎస్‌టీ కౌన్సిల్‌కు సిఫార్సులు చేసే ఫిట్‌మెంట్‌ కమిటీ, ప్రస్తుత పరిస్థితులలో కార్లు, బిస్కెట్‌లపై విధిస్తున్న జీఎస్‌టీ రేట్లలో ఎటువంటి మార్పు ఉండకూడదని జీఎస్‌టీ కౌన్సిల్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగా ఆటోమొబైల్స్‌, వినియోగ ఆధారిత రంగాలపై జీఎస్‌టీ తగ్గుతుందని మార్కెట్‌ వర్గాలు ఆశించాయి. సెప్టెంబర్‌ 20 వ తేదిన జరగనున్న 37 వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ఫిట్‌మెంట్‌ కమిటీ సిఫార్సులపై చర్చ జరుగుతుందనే విషయం తెలిసిందే.  ఆటోమొబైల్స్‌పై

Most from this category