News


సెన్సెక్స్‌ 312 పాయింట్లు అప్‌

Tuesday 25th June 2019
Markets_main1561458791.png-26566

97 పాయింట్ల లాభపడిన నిఫ్టీ

మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీగా లాభపడింది. మెటల్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 312 పాయింట్లు లాభపడి 39,435 వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 1,796.50 వద్ద స్థిరపడింది. ఫలితంగా సూచీల 2రోజుల నష్టాలకు నేడు బ్రేక్‌ పడినట్లైనంది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 245పాయింట్లు(0.80శాతం) లాభపడి 30,847.05 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మార్కెట్‌ నేడు నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 40 పాయింట్ల నష్టం‍తో 39,084 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లను కోల్పోయి 11,681 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఫార్మా, ఐటీ, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 177 పాయింట్లను కోల్పోయి 38,946 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లను 11,651 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ పూనుకున్నారు. మెటల్‌, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల రికవరితో మార్కెట్‌ నుంచి నష్టాల నుంచి గట్టెక్కింది. మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్ల జోరు మరింత పెరగడంతో సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. ఒకదశలో సెన్సెక్స్‌ కనిష్టస్థాయి(38,946)నుంచి  543 పాయింట్లు లాభపడి 39,490.64 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం(11,651) నుంచి 176 పాయింట్లను ఆర్జించి 11,814.40 వద్ద ఇంట్రాడే హైని నమోదు చేసింది. చివరి అరగంటలో కొంత లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్‌ 39,435 వద్ద, నిఫ్టీ 11,796 వద్ద స్థిరపడ్డాయి. 

టాటాస్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడగా, ఎల్‌ అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, ఇన్ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

52 వారాల కనిష్టానికి 200 షేర్లు

Tuesday 25th June 2019

బీఎస్‌ఈలో  204 స్టాక్‌లు తాజా ట్రేడింగ్‌లో ఏడాది కనిష్ఠాన్ని తాకాయి. గ్లెన్‌మార్క్‌ పార్మా, మెక్‌ లియోడ్‌ రస్సెల్‌, ఈరోస్‌ మీడియా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఇమామి, టీవీఎస్‌ మోటర్‌, హెచ్‌టీ మీడియా, గాబ్రియల్‌ ఇండియా వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి. 

ఫెడ్‌ స్వరం మారింది!

Tuesday 25th June 2019

న్యూట్రల్‌ రేట్‌ తగ్గించిన యూఎస్‌ కేంద్రబ్యాంకు దీర్ఘకాలిక వడ్డీరేట్ల అంచనాలను యూఎస్‌ ఫెడరల్‌ తగ్గించింది. యూఎస్‌ ఎకానమీలో మందగమనం మరింత పెరగకుండా, వృద్ధి పరుగులు పెట్టాలంటే వడ్డీరేట్లు మరింతగా తగ్గించాలని ఫెడ్‌ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. న్యూట్రల్‌ రేటు(ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపని రేటు) 2.5 శాతం ఉండాలని తాజాగా ఫెడ్‌ నిర్ణయించింది. 2014లో న్యూట్రల్‌ రేటు 4 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చిలో న్యూట్రల్‌ రేటు 2.75 శాతముంది. న్యూట్రల్‌రేటును

Most from this category