రెండో రోజూ లాభాలే..!
By Sakshi

11100పైన ముగిసిన నిఫ్టీ బజాజ్‌ఫిన్ సర్వీసెస్, మారుతి, టైటాన్, ఐషర్‌మోటర్స్, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్ షేర్లు 3శాతం నుంచి 14.50శాతం వరకు లాభపడ్డాయి. కోల్ ఇండియా, హిందాల్కో, టెక్‌మహీంద్రా, సిప్లా, యస్ బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 8శాతం నష్టపోయాయి.
254 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు అదనపు పన్ను మినహాయింపవచ్చనే అంచనాలతో మార్కెట్ రెండోరోజూ లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణం కూడా మన ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 254.55 పాయింట్ల లాభంతో 37,581.91 వద్ద, నిఫ్టీ 77.20 పాయింట్లు పెరిగి 11,109.65 వద్ద ముగిశాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు, అటో, ఆర్థిక, ఎఫ్ఎంజీసీ రియల్టీ రంగ షేర్లకు కొనగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, మెటల్, మీడియా, ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్యస్థాయి షేర్లు రాణించాయి. ఫలితంగా నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు 1లాభపడ్డాయి. ప్రైవేట్‌రంగ బ్యాంక్ షేర్ల ర్యాలీతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ సైతం 321 పాయింట్లు పెరిగి 28,438.70 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే నిఫ్టీ ఇండెక్స్ 11,062.80 - 11,181.45 రేంజ్లో ట్రేడవ్వగా, సెన్సెక్స్ 37,406.26 - 37,807.55 శ్రేణిలో కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 1శాతం పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 6పైసలు బలహీనపడింది. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 463 లాభపడగా, నిఫ్టీ 112 పాయింట్లు ర్యాలీ చేసింది.
You may be interested
ఎల్ఐసీ ఐపీఓ.. నిజమైతే చాలా పాజిటివ్!
Friday 9th August 2019గౌరవ్‌గార్గ్, క్యాపిటల్ వయా రిసెర్చ్ లిమిటెడ్ డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని ఐపీఓకి తెచ్చే ఆలోచన చాలా పాజిటివ్ ముందడుగని క్యాపిటల్ వయా గ్లోబల్ రిసెర్చ్ హెడ్ గౌరవ్‌గార్గ్ చెప్పారు. ఈ దఫా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఎల్ఐసీని లిస్టింగ్‌కు తీసుకురావడం మంచిదన్న ఆలోచనలో ఉంది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి దాదాపు 74
కశ్మీర్ ఇష్యూతో పాక్ స్టాక్ మార్కెట్ కకావికలం!
Friday 9th August 2019భారత్‌తో వాణిజ్య సంబంధాల రద్దుతో వెల్లువెత్తిన అమ్మకాలు ఐదేళ్ల కనిష్ఠాలకు సూచీలు వరుసగా ఆరోరోజు కూడా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లో భారీ పతనం నమోదయింది. దీంతో పాక్ స్టాక్ ఇండెక్స్ కేఎస్ఈ 100 ఐదేళ్ల కనిష్ఠస్థాయికి చేరింది. ఒకదశలో ఇంట్రాడేలో 29400 పాయింట్ల కనిష్ఠాలను తాకిన కేఎస్ఈ చివరకు 29800 పాయింట్ల వద్ద సెటిలైంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల రద్దు ప్రకటన తర్వాత పాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మందగమన ప్రభావంతో