News


బుల్‌ జోరు- సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ

Thursday 2nd January 2020
Markets_main1577960810.png-30621

సెంచరీతో నిఫ్టీ.. క్లోజింగ్‌ రికార్డ్‌
మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ జూమ్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొత్త ఏడాది తొలి రోజు కనిపించిన హుషారు వరుసగా రెండో రోజు కొనసాగింది. దీంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీ కొట్టింది. దీంతో సెన్సెక్స్‌ 321పాయింట్లు జంప్‌చేసి 41627 వద్ద నిలవగా.. నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 12283 వద్ద ముగిసింది. వెరసి తద్వారా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టానికి చేరువలో స్థిరపడగా.. నిఫ్టీ క్లోజింగ్‌లో గరిష్ట రికార్డ్‌ నెలకొల్పింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,649 వరకూ పెరిగింది. మరోపక్క 41,328 వద్ద కనిష్టాన్ని సైతం తాకింది. ఇక ఒక దశలో 12290 వరకూ ఎగసిన నిఫ్టీ 12,195 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడగా.. మెటల్‌ 2.7 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2 శాతం చొప్పున పుంజుకున్నాయి. ప్రయివేట్‌​బ్యాం‍క్స్‌, రియల్టీ, ఆటో 1.2-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌, ఇండస్‌ఇండ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతా, గ్రాసిమ్‌, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, గెయిల్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఐషర్‌ 2.3 శాతం క్షీణించగా.. బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, సిప్లా, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.5 శాతం మధ్య నీరసించాయి.

సెయిల్‌ భళా
డెరివేటివ్స్‌ విభాగంలో సెయిల్‌ 10 శాతం దూసుకెళ్లగా.. ఎన్‌బీసీసీ, నాల్కో, ఎన్‌సీసీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, అపోలో హాస్పిటల్స్‌, శ్రీ సిమెంట్‌ 8-4.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క మారికో, టీవీఎస్‌ మోటార్‌, సన్‌ టీవీ, గోద్రెజ్‌ సీపీ, బీపీసీఎల్‌, పిరమల్‌, బెర్జర్‌ పెయింట్స్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 2.4-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. మార్కెట్లను మించుతూ చిన్న షేర్లు జోరు చూపాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3 శాతంపైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1731 లాభపడగా.. 773 మాత్రమే నష్టపోయాయి.

డీఐఐల పెట్టుబడులు 
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 59 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 208 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1265 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 585 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 



You may be interested

అంచనాలే అంతిమం కాదు!

Thursday 2nd January 2020

సమయానుగుణంగా మార్చుకోవాలి లేదంటే బకరా అవడం ఖాయం సీనియర్‌ అనలిస్టు సీకే నారాయణ్‌ ‘‘అప్పుడప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేయాలోయ్‌!’’ అని కన్యాశుల్కంలో గిరీశం తన శిష్యుడికి హితోపదేశం చేస్తాడు. ఈ సూత్రం ఆ శిష్యుడికి పనికివచ్చిందో లేదో కానీ, మార్కెట్లో మదుపరికి మాత్రం తారకమంత్రంతో సమానమని సీనియర్‌ అనలిస్టు సీకే నారాయణ్‌ చెబుతున్నారు. మార్కెట్లకు అనుగుణంగా మన అంచనాలను మార్చుకోవాలని, మూర్ఖంగా తా పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లు ఒక అంచనా ఏర్పరుచుకొని, అందుకు రివర్సులో

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ జోరు

Thursday 2nd January 2020

దేశీయ ఈక్విటీ మార్కెట్లో ప్రభుత్వరంగ షేర్లకు గురువారం భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.05శాతం పెరిగింది.  నేడు పీఎస్‌యూ ఇండెక్స్‌ 2,530.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం నుంచి లాభాల్లో కదలాడినప్పటికీ.., మిడ్‌సెషన్‌ కొనుగోళ్లు ఇండెక్స్‌ను మరింత పరుగులు పెట్టించాయి. ఒక దశలో ఇండెక్స్‌ 2.22శాతం వరకు పెరిగి 2582.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి

Most from this category