News


సెన్సెక్స్‌ ట్రిపుల్‌ - 2 వారాల గరిష్టం

Wednesday 12th February 2020
Markets_main1581503711.png-31732

నిఫ్టీ 93 పాయింట్లు ప్లస్‌
రెండు వారాల గరిష్టానికి మార్కెట్లు
ఎఫ్‌ఎంసీజీ జూమ్‌

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. సానుకూల ప్రపం‍చ సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఏదశలోనూ వెనుదిరిగి చూడలేదు. వెరసి రెండు వారాల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లు జంప్‌చేసి 41,566 వద్ద నిలవగా.. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 12,201 వద్ద స్థిరపడింది. మంగళవారం సైతం సెన్సెక్స్‌ 237 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. కాగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 41,672 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,331 వద్ద కనిష్టం నమోదైంది. ఇక నిఫ్టీ 12,232- 12,144 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మంగళవారం అమెరికా మార్కెట్లు మరోసారి సరికొత్త గరిష్ట రికార్డుల వద్ద ముగిసిన విషయం విదితమే.

ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ 2 శాతం జంప్‌చేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ అదే స్థాయిలో వెనకడుగు వేశాయి. ఆటో, మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఐటీ 0.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఫార్మా, రియల్టీ 0.7 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌యూఎల్‌ 5 శాతం జంప్‌చేయగా.. కొటక్‌ బ్యాంక్‌, ఐషర్‌, ఐసీఐసీఐ, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, విప్రో, ఆర్‌ఐఎల్‌, హీరో మోటో 2.2-1.2 శాతం మధ్య బలపడ్డాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 4.5 శాతం పతనంకాగా.. ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, సిప్లా, ఐవోసీ, యూపీఎల్‌, గ్రాసిమ్‌ 1.5-0.5 శాతం మధ్య క్షీణించాయి.

గోద్రెజ్‌ సీపీ ప్లస్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో గోద్రెజ్‌ సీపీ, ఎంజీఎల్‌, ఇండిగో, మెక్‌డోవెల్‌, ఐజీఎల్‌, మదర్‌సన్‌, డాబర్‌ 4.7-2.2 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క ఐడియా, బీహెచ్‌ఈఎల్‌, సీమెన్స్‌, టాటా పవర్‌, ఉజ్జీవన్‌, హెచ్‌పీసీఎల్‌, పీఎన్‌బీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ 7.2-2.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.2 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1493 నష్టపోగా.. 973 మాత్రమే లాభాలతో ముగిశాయి.

అమ్మకాలవైపు ఎఫ్‌పీఐలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 209 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 345 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 184 కోట్లు, దేశీ ఫండ్స్‌ దాదాపు రూ. 736 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.You may be interested

దమానీ పోర్టుఫోలియోలో షేర్లివే!

Wednesday 12th February 2020

అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేరు ర్యాలీతో దమానీ దేశంలో ఆరో అతిపెద్ద కుబేరుడుగా అవతరించాడు. ఈ మార్ట్స్‌ ఆరంభానికి ముందే ఆయన ఒక వాల్యూ ఇన్వెస్టర్‌గా సుపరిచితుడు. ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా సైతం దమానీని తన గురువుగా పేర్కొంటాడంటే, ఇన్వెస్టర్‌గా ఆయన ప్రఖ్యాతి అంచనా వేయొచ్చు. మొదటి నుంచి హైక్వాలిటీ స్టాకుల ఎంపికలో దమానీకి మంచిపేరుంది. అలాంటి దమానీ పోర్టుఫోలియోలో ఉన్న షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి... = అవెన్యూసూపర్‌

8శాతం నష్టంతో ముగిసిన వోడాఫోన్‌ ఐడియా

Wednesday 12th February 2020

ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత   వోడాఫోన్‌ ఐడియా కంపెనీ షేరు బుధవారం 8శాతం నష్టంతో ముగిసింది. కంపెనీ గురువారం మూడో త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో అప్రమత్తత వహిస్తుండటం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో రూ.4.87ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఒక దశలో 9.50శాతం క్షీణించి రూ.4.87 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగిసే

Most from this category