News


ట్రిపుల్‌ సెంచురీతో సెన్సెక్స్‌ ప్రారంభం

Wednesday 19th February 2020
Markets_main1582084571.png-31916

ప్రారంభంలోనే నిఫ్టీ లాభాల సెంచరీ
41,250 పాయింట్లను దాటేసిన సెన్సెక్స్‌
12,100 స్థాయిని అధిగమించిన నిఫ్టీ

నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. 364 పాయింట్లు జంప్‌చేసి 41,259కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం సెంచరీ సాధించింది. 111 పాయింట్లు ఎగసి 12,103ను తాకింది. కరోనా కారణంగా 2020 తొలి త్రైమాసికంలో అమ్మకాలు నీరసించవచ్చంటూ ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ప్రకటించడం‍తో వరుసగా నాలుగో రోజు మంగళవారం సైతం​దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనపడిన సంగతి తెలిసిందే. మరోపక్క అమెరికా మార్కెట్లు సైతం డీలాపడ్డాయి. అయితే దేశీయంగా ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టడం కూడా మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఫార్మా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇంఢ్‌, జేఎస్‌డబ్ల్యూ  స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంతా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ 4-1.5 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో కేవలం యస్‌ బ్యాంక్‌ 2 శాతం, ఎయిర్‌టెల్‌ 1 శాతం చొప్పున డీలా పడ్డాయి.

అరబిం‍దో జోరు
డెరివేటివ్స్‌లో అరబిందో 14 శాతం దూసుకెళ్లగా.. ఐడియా, శ్రీ సిమెంట్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎండీసీ, పిరమల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, సన్‌ టీవీ 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క డాబర్‌, టాటా గ్లోబల్‌ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున బలపడ్డాయి. 724 షేర్లు లాభాలతో ప్రారంభం‍కాగా.. 136 నష్టాలతో కదులుతున్నాయి. You may be interested

వీఐఎల్‌ బ్యాంకు గ్యారెంటీలకు భయం లేదు!

Wednesday 19th February 2020

వొడాఫోన్‌ ఐడియా బకాయిలకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సొమ్ముచేసుకునే ఉద్దేశంలో(ఇన్‌వోక్‌ చేయడం) లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం రంగ సంక్షోభ నివారణకు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం ఇతర బకాయిల చెల్లింపులను వాయిదా వేయడం లాంటి చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీంతో ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు కాస్త సులభతరం కావచ్చని తెలిపాయి. ప్రస్తుతానికి ఇవన్నీ చర్చల దశలో ఉన్నాయన్నారు. బ్యాంకు గ్యారెంటీలను

రూ.3499లకే అంతర్జాతీయ విమాన టికెట్‌

Wednesday 19th February 2020

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 3,499కే విదేశీ రూట్లలో విమాన టికెట్ అందిస్తోంది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ అంతర్జాతీయ చౌక చార్జీల ఆఫర్‌ మంగళవారం (18న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 21తో ముగియనుంది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 2.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరిగే

Most from this category