News


40000పైన ముగిసిన సెన్సెక్స్‌

Wednesday 30th October 2019
Markets_main1572432689.png-29240

57 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 
నాలుగోరోజూ లాభాలే
రాణించిన ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఐటీ షేర్లు

పన్ను తగ్గింపు అశావహ అంచనాలతో మార్కెట్‌లో మరోసారి బుల్స్‌ సందడి చేశాయి. ఫలితంగా సూచీలు వరుసగా రోజూ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 220.03పాయింట్లు లాభపడి 4నెలల అనంతరం మొదటిసారిగా 40000 మార్కుపైన 40,051 స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11850 సమీపంలో 11,844 వద్ద ముగిసింది. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌ షేర్ల ర్యాలీ... సూచీలు భారీ లాభాలను ఆర్జించేందుకు దోహదపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 346 పాయింట్లు పెరిగి 40,178 ‍వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 11,884 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఆశాజనక కార్పోరేట్‌ ఫలితాలు, దేశీయఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 1శాతం వరకు తగ్గడం తదితర సానుకూలాంశాలు సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. మరోవైపు ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లు, రియల్టీ, ఫార్మా, మెటల్‌, మీడియా, అటో రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఇంట్రాడేలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30వేల పైన ట్రేడైనప్పటికీ.., చివరికి 0.38శాతం లాభంతో 29,987.50 వద్ద స్థిరపడింది. 


నిఫ్టీ నిర్మాణాత్మక అప్‌ట్రెండ్‌ దిశగా కదులుతుంది. వచ్చే వారాల్లో 12200-12300 స్థాయిని పరిక్షీంచే అవకాశం ఉంది. ఇటీవల ఒక బలమైన ర్యాలీ జరిగింది కాబట్టి 11650-11950 రేంజ్‌లో కొంత కన్షాలిడేషన్‌ జరగవచ్చు. మెటల్‌, ఎంచుకోబడిన బ్యాంకింగ్‌ షేర్లు సానుకూల దృక్పథంతో ట్రేడ్‌ అవుతున్నాయి. మిడ్‌క్యాప్‌లో ఎన్నుకోబడిన షేర్లను కొనుగోలు చేయడం ఉత్తమం-

కోటక్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ సాహజ్‌ అగర్వాల్‌ 

ఐటీసీ, టీసీఎస్‌, ఎస్‌బీ, గ్రాసీం, గెయిల్‌ షేర్లు 2.50శాతం నుంచి 6.50శాతం వరకు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతి, సిప్లా, యస్‌బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2శాతం నుంచి 5.50శాతం నష్టపోయాయి. 



You may be interested

ఇవి భలే లాభసాటి..!

Thursday 31st October 2019

నిఫ్టీ-50 తన కీలక నిరోధ స్థాయిలు 11,700-11,800ను ఎట్టకేలకు అధిగమించి పైన క్లోజవడంతో, గత గరిష్ట స్థాయి 12,103ను పరీక్షించే దిశగా వెళుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. దీంతో ప్రధాన సూచీ కీలకమైన స్వల్ప కాల, దీర్ఘకాల సగటు చలనాలకు పైకి చేరడం బుల్లిష్‌నెస్‌కు సంకేతంగా పేర్కొంది. కొనసాగుతున్న నిర్మాణాత్మక మార్పులతో ఇండెక్స్‌ తిరిగి తన ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 12,100ను రానున్న నెలల్లో సవాలు చేయగలదని భావిస్తున్నట్టు ఐసీఐసీఐ

మీ దగ్గర ఎంత బంగారం వుందో చెప్పాల్సిందే!

Wednesday 30th October 2019

త్వరలో కేంద్రం హుకుం  మీ దగ్గర బంగారం ఎంతవుందో తెలుసుకోవడానికి, లెక్కల్లో ప్రకటించని బంగారాన్ని చట్టబద్ధం చేయడానికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ పథకానికి రూపకల్పన చేస్తోందని, ఈ పథకానికి సం‍బంధించి విధివిదానాలను ప్రభుత్వం తొందరలో ప్రకటిం‍చనుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పరిమితికి మించిన బంగారం కలిగివుంటే ఈ పథకం ద్వారా వెల్లడించి, దానిపై పన్నులను చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ‘ఈ పథకంలో ఎంత బంగారం కలిగివుండాలనేదానిపై ప్రభుత్వం

Most from this category