సెన్సెక్స్ 800 పాయింట్లు క్రాష్
By Sakshi

బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్ వర్గాలను మెప్పించకపోవడంతో రెండో రోజూ సూచీలు నిలువునా పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్, రేపటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత తదితర అంశాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. సెన్సెక్స్ ఏకంగా 793 పాయింట్లు నష్టపోయి 39 వేల దిగువున 38,720 వద్ద ముగిసింది. నిఫ్టీ నాలుగేళ్లలో తొలిసారి ఒక ట్రేడింగ్ సెషన్లో ఇంతటి భారీ పతనాన్ని చవిచూసింది. ఇంట్రాడేలో 288 పాయింట్లు మేర నష్టపోయి నిఫ్టీ చివరికి 252.55 క్షీణించి 11,558.60 వద్ద స్థిరపడింది. లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ వాటా 25శాతం నుంచి 35శాతానికి పెంచడటం, కంపెనీలు ప్రకటించే బై బ్యాక్‌లపై 20శాతం పన్ను చెల్లింపు ప్రతిపాదన, ధనికులు చెల్లించే ఆదాయ పన్నుపై సర్ ఛార్జీల భారీ పెంపు లాంటి ఊహించని ప్రకటనలు మార్కెట్‌కు రుచించలేదు. ఫలితంగా ఈ రెండురోజుల్లోనే సెన్సెక్స్ 1260 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 404 పాయింంట్లు నష్టపోయింది. స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ఈ రెండు రోజుల్లో రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక, అటో, షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆ బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల మూలధన నిధులను కేటాయించినప్పటికీ.., ఈ రంగ షేర్లు నేటి ట్రేడింగ్‌లో తీవ్రంగా నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 6శాతం క్షీణించింది. బ్యాంకింగ్ రంగ షేర్ల పతనంతో ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ 872 పాయింట్లు(2.77శాతం) పడిపోయి 30,603.85 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు అధికంగా క్షీణించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2శాతం క్షీణించగా, బీస్ఎప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.50శాతం నష్టపోయింది.
హీరోమోటోకార్ప్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్ షేర్లు 5.5శాతం నుంచి 10శాతం క్షీణించగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఇన్ఫ్రాటెల్, హెచ్‌సీఎల్‌టెక్, యస్ బ్యాంక్ షేర్లు అరశాతం నుంచి 6శాతం లాభపడ్డాయి.
You may be interested
ఈ భారీ పతనం వెనుక...ఏమై ఉండొచ్చు?
Monday 8th July 2019ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపన్ను సర్ చార్జీ పెంచుతూ బడ్జెట్లో చేసిన ప్రకటన సోమవారం భారీ నష్టాలకు దారి తీసి ఉండొచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. బడ్జెట్ కాపీ చూసిన తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) లాభాల స్వీకరణకు పోటీపడి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇండెక్స్ స్టాక్స్‌లో ఎక్కువ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. బడ్జెట్లో ఆదాయపన్ను సర్ చార్జీని పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు. దీనివల్ల విదేశీ ఇన్వెస్టర్ల దీర్ఘకాలిక
ఈక్విటీ పెట్టుబడులు పాపం కాదు: విజయ్ కేడియా
Monday 8th July 2019చిన్న వయుసులోనే మల్టీబ్యాగర్‌గా దలాల్ స్ట్రీట్‌లో గుర్తింపు పోందారు విజయ్ కేడియా. విలువైన పెట్టుబడిదారుగా గుర్తింపు పొందిన కేడియా ప్రభుత్వం బడ్జెట్లో మార్కెట్లపై పన్నులను విధించి పేద, మధ్య తరహ ఇన్వెస్టర్లు నష్టపోవడానికి కారణం అయ్యిందని ఆరోపించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే..... ‘‘స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం సిగరెట్ తాగడం, మద్యం సేవించడం వంటి పాపాలుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. లేకపోతే ఈక్విటీలపై పన్నులను విధించేందుకు ఎందుకు మార్గాలను వెతుకుతోందో అర్ధం కావడం లేదు. ఈ