News


అమ్మకాల సునామీ....సెన్సెక్స్‌ 770 పాయింట్లు క్రాష్‌

Tuesday 3rd September 2019
Markets_main1567506653.png-28168

మార్కెట్‌ను ముంచెత్తిన ఆర్థిక మాంద్య భయాలు

ఆర్థిక మందగమన భయాలు మార్కెట్‌ను మరోసారి ముంచేశాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాలు వెల్లువలా సాగడంతో నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 10800 దిగువున 10,797.90 వద్ద, సెన్సెక్స్‌ 770 పాయింట్లను కోల్పోయి 36,563 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ మినహా అన్నిరంగాలకు చెందిన షేర్లల్లో విపరీతంగా అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ 603.70 పాయింట్లు క్షీణించి 26,824.15 వద్ద స్థిరపడింది. అయితే., రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టానికి, ఆగస్ట్‌లో దేశీయ తయారీ రంగం పనితీరు 15నెలల కనిష్టానికి తగ్గినట్లు గణాంకాలు వెలువడటం, వాహన అమ్మకాల గణాంకాల రెండంకెల క్షీణత నమోదు చేయడం, ఇదే ఆగస్ట్‌లో జీఎస్‌టీ వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యల్పంగా రూ.98,202 కోట్ల వసూళ్లకు పరిమితం కావడం వ్యవస్థలో గణనీయమైన మందగమనం నెలకొన్నట్లు స్పష్టమైంది. అలాగే బ్యాంకింగ్‌ వ్యవస్థను చక్కదిద్దే ప్రక్రియలో భాగంగా కేంద్రం ప్రకటించిన ‘‘ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనం’’ మార్కెట్‌కు రుచించలేదు. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణ ఆగకపోవడం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా కరిగిపోవడం తదితర కారణాలు మార్కెట్‌ల్లో అమ్మకాల సునామిని సృష్టించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మొదలైన అమ్మకాలు ఏదశలో ఆగలేదు. యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం నుంచి కూడా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో అమ్మకాలు మరింత ఉధృతంగా కొనసాగాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 856 పాయింట్లు వరకు నష్టపోయి, 36,466.01 వద్ద, నిఫ్టీ 250 పాయింట్ల నష్టపోయి 10,772.70 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి
నిఫ్టీ-50 ఇండెక్స్‌లో మొత్తం 50 షేర్లకు గానూ.., కేవలం
హెచ్‌సీఎల్‌, టెక్‌మహీంద్రా షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా, మిగిలిన 48 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  ఐఓసీ, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, టాటాస్టీల్‌ షేర్లు 4శాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి. You may be interested

ఆర్థిక రికవరీతో ముందు లాభపడేవి ఇవే..

Wednesday 4th September 2019

మందగమనం ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగించేదే అయినా... ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోకు మంచిదేనంటున్నారు నిపుణులు. తాజా మార్కెట్ల పతనం.. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు సౌకర్యవంతమైన వ్యాల్యూషన్ల వద్ద పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని అవకాశంగా సూచిస్తున్నారు. దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి పడిపోయింది. అంతర్జాతీయ ఎకానమీ సైతం మాంద్యాన్ని సూచిస్తోంది. అయితే పడిపోతున్న వృద్ధికి ప్రభుత్వం ఇటీవల కొన్ని చర్యలను కూడా ప్రకటించింది. దీర్ఘకాలం కోసం

ఏడాది కనిష్ఠాన్ని తాకిన 115 స్టాకులు

Tuesday 3rd September 2019

ఎన్‌ఎస్‌ఈ మంగళవారం సెషన్‌లో సుమారుగా 115 స్టాకులు వాటి  52 వారాల కనిష్టానికి పడిపోయాయి. కెనరా బ్యాంక్, డీబీ కార్ప్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఫోర్జ్ షేర్లు వాటి 52 వారాల కనిష్టాన్ని తాకిన స్టాక్లలో ఉన్నాయి. వీటితో​పాటు అడోర్ వెల్డింగ్, అరవింద్ ఫ్యాషన్స్, భారతీయ ఇంటర్నేషనల్, బటర్‌ఫ్లై గాంధీమతి అప్లైన్స్‌, సీఈఎస్‌సీ వెంచర్స్, డైనమేటిక్‌

Most from this category