News


పతనానికి ఐదు కారణాలు

Monday 8th July 2019
Markets_main1562578185.png-26898

 పలు ప్రతికూలాంశాల నడుమ సోమవారం మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్‌ 600 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల మేర నష్టపోయాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలు, అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు జూన్‌ నెలలో పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ప్రస్తుత పరిస్థితులలో అమెరికా ఫెడ్‌ వడ్డిరేట్ల తగ్గింపు ఉండదనే భయాలతో ఆసియా మార్కెట్లు 2 శాతం మేర పతనంకావడం ఇక్కడి మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు పశ్చిమాసియా దేశాలలో రాజకీయ ఉద్రిక్తతల వలన చమురు ధరలు పెరిగి రూపీపై ప్రభావం చూపుతున్నాయి.  మార్కెట్లును ప్రభావితం చేసిన ఐదు అంశాలు.

బడ్జెట్‌ ప్రతిపాదనలు:
స్టాక్‌ మార్కెట్లలో నమోదైన కంపెనీలలో పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ వాటాను 25 శాతం​నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో పాటు కంపెనీల బై బ్యాక్‌లపై 20 శాతం పన్నులను వసూలు చేయాలనే నిర్ణయం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. అంతేకాకుండా అధిక సంపాదనల పన్నులపై సర్‌ చార్జీలను పెంచడంతో విదేశి ఫండ్స్‌ ప్రభావం పడింది. మన దేశంలో ట్రస్ట్‌లు లేదా ఏఓపీ(అసోషియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌) ద్వారా విదేశి పెట్టుబడులు అధికంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. 

అమెరికా ఉద్యోగ కల్పనలో వృద్ధి:
అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు జూన్‌ నెలలో పెరగడంతో ఫెడ్‌ వడ్డి రేట్ల తగ్గింపు ఉండదమోననే భయాలు నేపథ్యం కూడా దేశియ ఈక్విటి మార్కెట్లను దెబ్బతీసాయి. అమెరికా ప్రభుత్వ పేరోల్‌లు జూన్‌ నెలలో పెరిగాయి. జూన్‌లో 224,000 కొత్త ఉద్యోగాలు భర్తి అయ్యాయి. ఇది గత ఐదు నెలల కంటే అధికం కావడం గమనర్హం. 

ఆసియా మార్కెట్ల పతనం:
 జూన్‌ నెలలో అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు పెరిగిందని శుక్రవారం నివేదిక వెలువడడంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టపోయాయి. షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 2.5 శాతం నష్టపోయింది. దీంతో పాటు హాంగ్‌ కాంగ్‌ హంగ్‌సెంగ్‌ 1.8 శాతం, దక్షిణ కొరియా కొస్పి 1.8 శాతం, జపాన్‌ నికాయ్‌ 1.01 శాతం, తైవాన్‌ టైక్స్‌ 0.53 శాతం పతనమై ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం ఇండియా ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనితో పాటు శుక్రవారం బడ్జెట్‌ కూడా మార్కెట్‌ను నిరుత్సాహ పరచడంతో నష్టాలు ఆగలేదు.

రూపీ, క్రూడ్‌ ఆయిల్‌:
అమెరికా ఉద్యోగ డేటా విడుదలయ్యాక అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు డాలర్ల మారకంలో బలహీనపడ్డాయి. దక్షిణ కొరియా వన్‌, ఇండొనేషియా రూపియా కరెన్సీలు డాలర్‌ మారకంలో  అరశాతం మేర పడిపోయాయి. ఇండియా రూపీ 21 పైసలు బలహీనపడి  68.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతేకాకుండా చమురు ధరలు పెరగడం కూడా రూపీపై ప్రభావం చూపింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.33 డాలర్ల వద్ద ప్రారంభమైంది. 

మదుపర్ల అభద్రతభావం:
జూన్‌ త్రైమాసిక ఫలితాలు వెలువడే సమయం కావడంతో పెట్టుబడిదారులు జాగ్రత్తను వహించారు. ఐటీ దిగ్గజం టీసీఎస్‌ మంగళవారం త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుండగా, ఇన్ఫోసిస్‌ శుక్రవారం తమ  ఫలితాలను విడుదల చేయనుంది. త్రైమాసిక ఫలితాలలో కార్పొరేట్‌ లాభాలు పెద్ద మొత్తంతో ఉంటాయని అనుకోవడం లేదని కానీ కొన్ని కంపెనీల ఫలితాలలో లాభాల వృద్థి కనిపించవచ్చని పరిశీలకులు తెలిపారు. 

 You may be interested

గ్లోబల్‌ మార్కెట్ల డౌన్‌గ్రేడ్‌

Monday 8th July 2019

రేటింగ్‌ తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ అంతర్జాతీయ మందగమన భయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్‌ సం‍స్థ మోర్గాన్‌స్టాన్లీ, ప్రపంచ మార్కెట్లను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఇప్పటివరకు కొనసాగిస్తున్న ఈక‍్వల్‌వెయిట్‌ రేటింగ్‌ను అండర్‌వెయిట్‌కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రపంచ మార్కెట్లలో అప్‌సైడ్‌ కదలికలు పరిమితంగా ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది కాలంలో ఎస్‌అండ్‌పీ 500, ఎంఎస్‌సీఐ యూరప్‌, ఎంఎస్‌సీఐ ఈఎం, తోపిక్స్‌ జపాన్‌ తదితర సూచీల్లో కేవలం ఒక్క శాతం అప్‌మూవ్‌ ఉండొచ్చని అంచనా

మైండ్‌ ట్రీ షేర్లకు రాజీనామా మంట

Monday 8th July 2019

12శాతం పతనమైన షేర్లు నిర్వాహణ విభాగం నుంచి ముగ్గురు కీలక అధికారులు రాజీనామాలు సమర్పించడంతో ఐటీ సేవల సంస్థ మైండ్‌ ట్రీ షేర్లు సోమవారం 12శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.861.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మైండ్‌ ట్రీ కంపెనీలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్ణయాత్మక వాటాను దక్కించుకున్న అనంతరం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి కృష్ణకుమారన్‌ నటరాజన్‌, వైస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి ఎన్‌ఎస్‌ పార్థసారథి, సీఎఫ్‌ఓ

Most from this category