News


మార్కెట్‌ పతనానికి ‘‘పంచ’’ కారణాలివే..!

Wednesday 25th September 2019
Markets_main1569407581.png-28545

మార్కెట్‌ బుధవారం భారీగా నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతిపక్ష పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం,  ఆసియా అంతటా మందగమనం వ్యాపించిందనే సంకేతాలు  ఆసియా డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి వెలువడటం వంటి కారణాలతో పాటు లాభాల స్వీకరణ తోడవ్వడంతో మార్కెట్‌ అమ్మకాలు అడ్డూఅదుపు లేకుండా పోయాయి. సెన్సెక్స్‌ 581 పాయింట్లు నష్టపోయి 38,510.97 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లను కోల్పోయి 11,421.80 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 1శాతం మేర క్షీణించాయి. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల సునామి నెలకొంది. అత్యధికంగా అటో షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ -50 సూచీలోని మొత్తం 50 షేర్లలో ఎక్కువగా ఎస్‌బీఐ, టాటామోటర్స్‌ నష్టపోయాయి. పతనానికి కారణాలివి...
అమెరికా రాజకీయ వివాదాలు:-
అమెరికాలో నెలకొన్న రాజకీయ వివాదం భారత్‌తో పాటు ప్రపంచమార్కెట్లన్నింటినీ తీవ్ర కలవరపెడుతుంది. వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన రాజకీయ ప్రత్యర్థులకు నష్టం చేకూర్చేందుకు విదేశీ శక్తుల్ని వాడుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు డెమాక్రటిక్ పార్టీ ఆరోపణలు చేసింది. అందులో భాగంగా ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్, ఆయన కొడుకు అవినీతి చేశారనే వాదనలపై విచారణ ప్రారంభించాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమీర్ జెలెంస్కీపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపింది. దీంతో డెమోక్రాటిక్‌ పార్టీ ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  దీనిపై అధికారికంగా విచారణ ప్రారంభిస్తామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పలోసీ ప్రకటించారు. అయితే ట్రంప్ ఈ విచారణను ‘ప్రెసిడెన్షియల్ వేధింపు’ అని పేర్కొన్నారు. అమెరికా రాజుకున్న ఈ రాజకీయ వివాదం ఇప్పుడు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నేడు ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించగా, యూరప్‌ మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 
లాభాల స్వీకరణ:- 
కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలతో శుక్ర, సోమవారాల్లో సెన్సెక్స్‌ 3000 పాయింట్లను, నిఫ్టీ 900 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిపిందే. సూచీలు రెండురోజుల భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో నేడు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పూనుకున్నారు. గరిష్టస్థాయిల వద్ద అప్రమత్తత వహించాలని నిపుణులు సలహానిస్తున్నారు. ‘ అధిక షేర్లు గరిష్ట వాల్యూవేషన్లతో తీవ్ర ఒడిదుడుకులతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ తరుణంలో షేర్లకు స్థిరత్వం అవసరం. రానున్న రోజుల్లో అస్థిరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు మార్కెట్ కదలికలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు.
సన్నగిల్లిన వాణిజ్య యుద్ధ చర్చల ఆశలు:- 
చైనా వాణిజ్య పద్ధతులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విమర్శించడంతో అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య చర్చల సఫలమవుతాయన్న ఆశలు సన్నగిల్లాయి. వాణిజ్య చర్చల్లో అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగించే ఒక్క ఒప్పందాన్ని కూడా తాను అంగీకరించేది లేదని మంగళవారం ట్రంప్‌ తెలిపారు. వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌లో సభ్యదేశంగా చైనా చేరినపుడు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో బీజింగ్ విఫలమైందని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా ఆరోపణలను చైనా దౌత్య అధికారులు ఖండించారు. అలాగే చైనా సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత అమెరికాకు ఉందని చైనా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభమైన అమెరికా చైనాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. 
ఆసియా వృద్ధిపై ఏడీబీ అందోళన:- 
ఆసియా ప్రాంతమం‍తటా వృద్ధి మందగమనం ఆవిరించినట్లు ఆసియా డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ తెలిపింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం 2020 నాటి వరకు జరుగుతుందని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కోంటున్న కష్టాల కంటే మరింత ఎక్కువగా ఉంటుందని ఏడీబీ ఆర్థిక వేత్త యసుయుకి సావాడ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియా వృద్ధి అంచనాల్ని 7శాతం నుంచి 6.50శాతానికి పరిమితం చేసింది. అయితే వచ్చే ఏడాది వృద్ధి రేటును 7.2శాతంగానే ఉంచింది. 
నిఫ్టీ సాంకేతిక కారణాలు:- 
నేడు నిఫ్టీ డైలీ చార్ట్‌లో  ఒక అనిశ్చిత డోజీని ఏర్పాటు చేసింది. ట్రేడర్లు కొంత అనిశ్చితంగా ఉన్నారనే అంశాన్ని ఇది సూచిస్తుంది. రానున్న రెండురోజుల్లో నిఫ్టీ కదలికల్లో కొంత బలహీనత, అస్థిరత ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణులు నాగరాజ్‌ శెట్టి తెలిపారు. సెప్టెంబర్‌ 23 తారీఖున నిఫ్టీ 11,471-11,381 మధ్యలో బుల్లిష్‌ గ్యాప్‌ జోన్‌ను ఏర్పాటు చేసింది. రానున్నరోజుల్లో ఈ స్థాయిలో కీలక మద్దతుగా నిలిచే అవకాశం ఉందని మరో చతుర్వేది డాట్‌ ఇన్‌ సాంకేతిక నిపుణుడు మజహర్‌ మహమ్మద్‌ తెలిపారు. You may be interested

బలహీన రంగాలవైపే మొగ్గు!

Wednesday 25th September 2019

  ‘ప్రభుత్వం కొత్తగా ఏర్పాటయ్యే తయారీరంగ కంపెనీలపై 15 శాతం ట్యాక్స్‌ను విధించింది. దీని ఫలితంగా చైనా నుంచి బయటకొచ్చే కంపెనీలకు ఇండియా ఆకర్షణియమైన గమ్యస్థానంగా కనిపిస్తుంది’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, సీఐఓ ఎస్ నరేన్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలలో ముఖ్యమైనది. మూలధన వ్యయం, ప్రైవేట్‌ పెట్టుబడుల పెరుగుదలే

నష్టాల బాటలో అటో రంగ షేర్లు

Wednesday 25th September 2019

మార్కెట్లో నెలకొన్న అమ్మకాల్లో భాగంగా అటో రంగ షేర్లు బుధవారం నష్టాల బాట పట్టాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 4.50శాతం క్షీణించింది. కేంద్రం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల దేశీయ అటోపరిశ్రమకు పెద్దగా మేలు జరగదని జెఫరీస్‌ లాంటి బ్రోకరేజ్‌ సంస్థలు ప్రకటించాయి. అలాగే మార్కెట్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కూడా అటో రంగ షేర్లపై ప్రభావాన్ని చూపుతుంది. నేటి

Most from this category