News


సెన్సెక్స్‌ నష్టం 433 పాయింట్లు

Friday 4th October 2019
news_main1570186333.png-28723

ఆర్థిక మందగమన భయాలతో ఆర్‌బీఐ జీడీపీ వృద్ధి అంచనాల్ని భారీ సవరించడంతో శుక్రవారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 433 పాయింట్లు నష్టపోయి 38000 దిగువున 37,673.31 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 139 పాయింట్లను కోల్పోయి 11200 దిగువున 11,174.75 వద్ద ముగిసింది. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు విపరీతంగా జరిగాయి. ముఖ్యంగా వడ్డీరేట్లకు ప్రభావితమయ్యే బ్యాంకింగ్‌, అటో, రియల్టీ షేర్లు తీవ్ర ఒడిదుకుడులకు లోనయ్యాయి. వాటితో పాటు మెటల్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌ షేర్లలో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి.  ఐటీ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల భారీ పతనం కారణంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయి 27,731.85 వద్ద స్థిరపడింది.  

ఇవాళ ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో మార్కెట్‌ విశ్లేషకులు అంచనాలకు అనుగుణంగా రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించారు. ఇదే క్రమంలో దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపీ 6.9శాతం నుంచి 6.1శాతంగానూ, వచ్చే ఆర్థిక ఏడాదికి గానూ జీడీపీ అంచనాను 7.2శాతంగా సవరించారు. ఈ అంశం మార్కెట్‌ను సెటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అలాగే నేటి ఉదయం వెలువడిన సెప్టెంబర్‌ సర్వీసుల పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ 19 నెలల కనిష్టస్థాయి కావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 'పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌' (పీఎంఐ) 52.4 నమోదైతే, సెప్టెంబర్‌ ముగిసేసరికి 'పీఎంఐ' 50 స్థాయికి దిగువన 48.7కు తగ్గిందని సర్వే తెలిపింది. 

సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం 38,403.54 నుంచి 770 పాయింట్లు నష్టపోయి 37,633.36 వద్ద, నిఫ్టీ ఇంట్రాడే హై(11,400.30) నుంచి 242 పాయింట్లు కోల్పోయి 11,158.35 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నిప్టీ ఇండెక్స్‌ వరుస మూడు వారాల లాభాల ముగింపునకు, బ్యాంక్‌ నిఫ్టీ 2వారాల వరస లాభాల ముగింపునకు బ్రేక్‌ పడింది.


టైటాన్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, అల్ట్రాటెక్‌, గ్రాసీం, జీ లిమిటెడ్‌ షేర్లు 3.50శాతం నుంచి 6.50శాతం నష్టపోగా, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, ఓఎన్‌జీసీ షేర్లు అరశాతం నుంచి 1శాతం వరకూ లాభపడ్డాయి. 



You may be interested

7 నుంచి సార్వభౌమ గోల్డ్‌ బాండ్‌ ఇష్యూ

Saturday 5th October 2019

దసరా, దీపావళి పండుగల సందర్భంలో బంగారానికి సహజంగా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సందర్భాల్లో పెట్టుబడుల కోణంలోనూ బంగారం కొనే వారుంటారు. కనుక ఈ అవకాశాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం మలివిడత సౌర్వ భౌమ బంగారం బాండ్ల ఇష్యూను చేపట్టింది. ఈ నెల 7వ తేదీన ఇష్యూ ఆరంభమవుతోంది. ఈ నెల 11వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది.    సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-5 కింద

నష్టాల మార్కెట్లో ఐటీ షేర్ల ర్యాలీ..!

Friday 4th October 2019

ఆర్‌బీఐ జీడీపీ అంచనాల్ని 6.1 శాతానికి తగ్గించడంతో మార్క్‌ట్‌లో విపరీతమైన అమ్మకాలు జరుగుతున్పటికీ.., ఐటీ షేర్లకు మాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 15,328.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఐటీ షేర్లకు డిమాండ్‌ను పెంచింది. ఫలితంగా డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు లాభాల బాట పట్టాయి. ఐటీ

Most from this category