లాభాలు ఒక్కరోజుకే పరిమితం
By Sakshi

మార్కెట్ నిన్నటి ట్రేడింగ్‌లో ఆర్జించిన లాభాలన్ని నేడు హరించుకుపోయాయి. ఫలితంగా సూచీలు లాభాలు ఒకరోజుకే పరమితమయ్యాయి. సెన్సెక్స్ 407 పాయింట్లను నష్టపోయి 39,194 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్ 107 పాయింట్లను కోల్పోయి 11750ల దిగువను 11,724 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆందోళనలు సూచీల నష్టాల ముగింపు కారణమయ్యాయి. నేడు కొత్త ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ అధ్యక్షతన 35వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగున్న నేపధ్యంలో ట్రేడర్లు అప్రమత్తత, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 11పైసలు బలహీనపడటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అటో, బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అరశాతం(152.75 పాయింట్లు) నష్టపోయి 30,628.35 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు మార్కెట్ నష్టంతోనే ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకు కట్టుబడటంతో సూచీలు ఏదశలోనూ లాభపడలేదు. ముఖ్యంగా ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో తప్ప అన్ని రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఓ దశలో సెన్సెక్స్ 580 పాయింట్లను కోల్పోయి 39,121.30 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లను నష్టపోయి 11,705.10 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. సూచీలు ఇది వరుసగా మూడోవారం నష్టాల ముగింపు కాగా... వారం మొత్తం మీద సెన్సెక్స్ 258పాయింట్ల నష్టపోయింది. నిఫ్టీ 99 పాయింట్లను కోల్పోయింది.
హీరో మోటోకార్ప్, హిందూస్థాన్ యూనిలివర్, హెచ్‌ఢీఎఫ్‌సీ, మారుతి, యస్ బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్, హిందాల్కో, యూపీఎల్ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి.
You may be interested
వచ్చే ఏడాది జియో ఐపీఓ?!
Friday 21st June 2019వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో జియోను పబ్లిక్ ఆఫర్‌కు తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అయితే అంతకన్నా ముందు తమ టవర్లు, ఫైబర్ అసెట్ల నిర్వహణ చూస్తే ఇన్విట్స్కు ఇన్వెస్టర్లను తీసుకురావాలని ఆర్ఐఎల్ భావిస్తోంది. గతవారం జియో ఐపీఓ యత్నాలు జోరందుకున్నాయని సంకేతమిచ్చే పలు సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో టెలికం వినియోగదారుల పరంగా టాప్‌లోకి వస్తామని జియో వివిధ బ్యాంకర్లకు తెలియజేసింది. ఇదే జరిగితే కంపెనీ రెవెన్యూ
ఎన్బీఎఫ్సీలో బజాజ్ ఫైనాన్స్ రూటు వేరు!
Friday 21st June 2019ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీ) రుణాల చెల్లింపులు జరగక ఎన్బీఎఫ్సీ రంగం కుదేలయిపోతుంటే బజాజ్ ఫైనాన్స్ మాత్రం ఈ ఏడాది టాప్ స్టాక్‌లో ఒకటిగా నిలిచింది. 2018 అగష్టు నుంచి ఎన్బీఎఫ్సీ షేర్లు 25 శాతం మేర నష్టపోయాయి. కొన్ని కంపెనీలు 89శాతం నష్టపోయాయి కూడా. కానీ బజాజ్ ఫైనాన్స్ 36శాతం లాభంతో సెన్సెక్స్‌లో ముందుంది. వినియోగ ఆధారిత రంగాలలో రుణాలను ఇవ్వడం, రూరల్, మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు