News


సెన్సెక్స్‌ 1600పాయింట్లు క్రాష్‌..!

Monday 9th March 2020
Markets_main1583735130.png-32356

  • ​​​​​​10650 దిగువకు నిఫ్టీ 
  • 6.50శాతం క్షీణించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
  • మార్కెట్‌ను వీడని కరోనా కష్టాలు..!

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులతో దేశీయ మార్కెట్‌ సోమవారం మరోసారి భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 1,161.22 పాయింట్ల నష్టంతో 36,415.40 వద్ద, నిఫ్టీ  329.55 పాయింట్లను కోల్పోయి 10,659.90 వద్ద ట్రేడింగ్‌ను ‍ప్రారంభించాయి. కరోనా వైరస్‌ 104దేశాలకు విస్తరించింనట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటనతో అంతర్జాతీయ వృద్ధి క్షీణత అంశం మరోసారి ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. దీనికి తోడు గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌ నుంచి క్రూడాయిల్‌ ధరలు అనూహ్య పతనంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లన్నీ 3నుంచి 4శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. 

దేశీయ పరిణామాల విషయానికొస్తే... యస్‌ బ్యాంక్‌ బోర్డు రద్దు ఉదంతం దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐల పెట్టుబడులు తరలిపోవడం లాంటి అంశాలు ఇన్వెస్టర్లకు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఇక ఫారెక్స్‌ రూపాయి రోజురోజూకు మరింత బలహీనపడుతోంది. నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ శనివారం ముగింపు(73.78)తో పోలిస్తే 25పైసలు బలహీనపడి 74.03 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 

ఉదయం గం.11:30ని.లకు సెన్సెక్స్‌ 1612 పాయింట్లు నష్టపోయి 35964.53 వద్ద, నిఫ్టీ 446.20 పాయింట్లను కోల్పోయి 10543.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3.50శాతం నష్టాన్ని చవిచూసి 27వేల దిగువన 26,902.50 వద్ద ట్రేడ్ అవుతోంది. 

పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వేదాంత, ఓఎన్‌జీసీ షేర్లు 5.50శాతం నుంచి 9.50శాతం నష్టపోయాయి. మరోవైపు సన్‌ఫార్మా, ఐఓసీ, బీపీసీఎల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 14.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

బంగారం ధర @1700డాలర్లు

Monday 9th March 2020

అంతర్జాతీయ మార్కెట్లో ఎనిదేళ్ల తరువాత బంగారం ధర తొలిసారి 1700డాలర్లను అందుకుంది. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత ఉధృతి కావడం, క్రూడాయిల్‌ ధరల అనూహ్య పతనం,  ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనంతో ఇన్వెస్టర్లు సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక సాధనంగా భావించే బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఫలితంగా బంగారం ధరలకు అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా డిమాండ్‌ నెలకొంది. ఆసియా మార్కెట్లో నేటి ఉదయం ఔన్స్‌ బంగారం ధర మునుపటి ముగింపుతో

యస్‌బ్యాంక్‌ వైఫల్యం భారత్‌కు రిస్కే: నోమురా

Saturday 7th March 2020

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు కేంద్రంతో పాటు ఆర్‌బీఐ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ నోమురా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. యస్‌బ్యాంక్‌ వైఫల్యం భారతదేశ ఆర్థికవ్యవస్థలో ఇప్పటికీ దాగి ఉన్న క్రిడెట్‌ రిస్క్‌ సూచిస్తుందని నోమురా హెచ్చరించింది.  దేశంలోనే ఐదో అతిపెద్ద ప్రైవేట్‌ రుణదాతగా పేరొందిన యస్‌బ్యాంక్‌కు మొత్తం రుణాల్లో 2.3 శాతం అకౌంట్లు, 1.6శాతం బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఎస్‌బీఐ ద్వారా 49శాతం

Most from this category