News


మరోసారి మార్కెట్‌ను ముంచిన కరోనా భయాలు

Friday 6th March 2020
Markets_main1583468544.png-32317

సెన్సెక్స్‌ 1400 పాయింట్లు క్రాష్‌
11వేల దిగువకు నిఫ్టీ 

ప్రపంచఈక్విటీ మార్కెట్లను మరోసారి కరోనా వ్యాధి వ్యాప్తి భయాలను వెంటాడటంతో దేశీయ మార్కెట్‌ శుక్రవారం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ ఏకంగా 1400 పాయింట్ల నష్టంతో 38వేల దిగువున 37070 వద్ద, నిఫ్టీ 326 పాయింట్లను కోల్పోయి 10942.65 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆర్థిక అగ్రరాజ్యమైన అమెరికా దేశాల్లో ప్రధాన నగరాలైన న్యూయార్క్‌; శాన్‌ఫ్రాన్సిస్కోలలో తాజాగా కరోనా వైరస్‌ వ్యాధి కేసులు నమోదు కావడంతో నిన్నరాత్రి అమెరికా సూచీలు 3.50శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లు సైతం 3శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే నిన్న యూరప్‌ మార్కెట్లు సైతం 1నుంచి2శాతం వరకు క్షీణించాయి. ప్రపంచమార్కెట్లలో నెలకొన్న కరోనా వ్యాధి భయాలు దేశీయ మార్కెట్‌ను వెంటాడాయి. ఇక దేశీయ పరిణామాల విషయానికోస్తే ... డాలర్ మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపు(73.35)తో పోలిస్తే 59 పైసలు బలహీనపడి 73.94 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 2018 అక్టోబర్‌ తర్వాత రూపాయి ఈ స్థాయికి దిగిరావడం ఇదే తొలిసారి కావడ గమనార్హం.

 ఉదయం గం.9:40ని.లకు నిఫ్టీ 316.90 పాయింట్లను కోల్పోయి 10952.10 వద్ద, సెన్సెక్స్‌ 1,072 పాయింట్లను కోల్పోయి 37398.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍న్ని రంగాల షేర్లలో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 4శాతానికి పైగా నష్టంతో 28వేల మార్కును కోల్పోయి 27,602 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

నిఫ్టీ -50 ఇండెక్స్‌లో ఏ ఒక్క షేరు కూడా లాభాల్లో ట్రేడ్‌ కావడం లేదు. టాటాస్టీల్‌, ఎస్‌బీఐ, టాటామోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 25శాతం నష్టాన్ని చవిచూశాయి. 



You may be interested

ఒకేరోజు రూ.1000 పెరిగిన పసిడి

Friday 6th March 2020

 ప్రపంచ దేశాల్లో  కోవిడ్‌-19 వేగంగా విస్తరిస్తుండడంతో ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడులవైపు దృష్టిపెట్టడంతో బంగారం ధర శుక్రవారం భారీగా పెరిగింది. దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.1000 పెరిగి 10గ్రాముల పసిడి రూ.44,468.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో ఇదే అల్‌టైమ్‌ హై. గురువారం ఆసియా మార్కెట్లతోపాటు  అమెరికా ఇండెక్స్‌లు 3శాతం పడిపోవడంతో అంతర్జాతీయంగాను బంగారం ధర పెరిగింది. నిన్నటితో పోలిస్తే 17 డాలర్లు‍ పెరిగి ఔన్స్‌ బంగారం ధర

కుప్పకూలిన యస్‌ బ్యాంక్‌ షేరు

Friday 6th March 2020

10 శాతం పతనంతో రూ. 33.15 వద్ద ఓపెనింగ్‌ వచ్చే నెల(ఏప్రిల్‌) 3 వరకూ ఖాతాదారులు రూ. 50,000కు మించి నగదును తీసుకునేందుకు వీలులేకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ కట్టడి చేసిన వార్తలతో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10 శాతం పతనమైంది. రూ. 33.15 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. తదుపరి 15 శాతం కుప్పకూలి రూ. 31.30కు చేరింది. ఆపై 9.35 ప్రాంతంలో మరో

Most from this category