News


ఆరోరోజూ అదే జోరు ...!

Friday 18th October 2019
Markets_main1571395638.png-28987

  • 246 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌
  • 11650పై ముగిసిన నిఫ్టీ 

మార్కెట్‌ లాభాలు ఆరో రోజూ కొనసాగాయి. సెన్సెక్స్‌ 246.32 పాయింట్లు పెరిగి 39,298.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75.50 పాయింట్లు లాభంతో 11,661.85 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగుతుండం, ఇప్పటివరకు క్యూ2 ఫలితాలను ప్రకటించిన కంపెనీలు అంచనాలకు మించి ఉండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి లాభాల ట్రేడింగ్‌ ఈక్విటీ కొనుగోళ్లకు కారణమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ ఇండెక్స్‌ల భారీ లాభాలకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో ఒక్క మీడియా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకుల షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభపడి 29000 పైన 29,120.25 వద్ద స్థిరపడింది. ఒకదశలో సెన్సెక్స్‌ 302 పాయింట్లు లాభపడి 39,361.06 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు వరకు లాభపడి 11,684.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. 
ఆరు రోజుల్లో రూ.6లక్షల కోట్ల సంపద సృష్టి:- 
మూడో త్రైమాసికం నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆంచనాలకు తోడు ప్రపంచ మార్కెట్లను సానుకూల సంకేతాలు అందండతో మార్కెట్‌ వరుసగా రోజూ లాభంతో ముగిసింది. ఈ వరుస ఆరో రోజుల  ర్యాలీలో ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లును ఆర్జించారు. సెన్సెక్స్‌ 1171 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 356 పాయింట్లు పెరిగింది. ఈ వారం ప్రారంభంలో విప్రో, హెచ్‌యూఎల్‌ లాంటి కంపెనీలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను ప్రకటిచడం సెంటిమెంట్‌ను బలపరిచింది. వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కావడం, వడ్డీరేట్ల తగ్గింపు అంచాలు పండుగ సీజన్‌, ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపన చర్యలు తదితర అంశాలు మార్కెట్లో పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిచ్చినిట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఆరు రోజుల్లో ఒక్క తప్ప మిగితా మిగిలిన ఐదురోజులు కొనుగోళ్లు జరిపారు.

గ్రాసీం, మారుతి, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌ సేర్లు 3శాతం నుంచి 8శాతం వరకు లాభపడ్డాయి. హిందాల్కో, ఐషర్‌మోటర్స్‌, సిప్లా, టాటామోటర్స్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 5.50శాతం నష్టపోయాయి. 



You may be interested

వచ్చే దీపావళికి బ్రోకరేజీల టాప్‌ పిక్స్‌

Friday 18th October 2019

గత దీపావళి నుంచి దేశీయ ఈక్విటీలు తీవ్ర అస్థిరతలు చవిచూశాయి. ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ, ఆర్థిక వృద్ధి మందగమనం, బలహీన ఫలితాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ మందగమనంపై ఆందోళనలు ఇలా ఎన్నో అంశాలు ఇందుకు కారణమయ్యాయి. అయితే, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత ఈ నష్టాలను మార్కెట్లు గణనీయంగా పూడ్చుకున్నాయి. దీంతో గత దీపావళి నుంచి చూస్తే సూచీలు 9 శాతం పెరిగాయి. కార్పొరేట్‌ పన్ను కోత, ఆర్‌బీఐ

ఈ మూడు రంగాల్లో నెగిటివ్‌ సర్‌ప్రైజ్‌!

Friday 18th October 2019

క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో కార్పొరేట్‌ బ్యాంకులు, మెటల్స్‌, ఆటో రంగాల కంపెనీలు కోలుకుంటాయని ఎక్కువమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మూడు రంగాల్లో నెగిటివ్‌ సర్‌ప్రైజ్‌ ఉండొచ్చని క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌ అభిప్రాయపడుతున్నారు. వీటిలో ఇంకా నెగిటివ్‌ వార్తలు రావాల్సిఉందన్నారు. అందువల్ల ఈ త్రైమాసికంలో ఫలితాలు అంతబాగా ఉండకపోవచ్చని తెలిపారు. అయితే పీఎస్‌యూ బ్యాంకులు గతంలో చవిచూసినంతటి డ్యామేజీ ఉండకపోవచ్చన్నారు. ఇప్పటికే ఈ నెగటివ్‌ వార్తల

Most from this category