News


చివరి గంట కొనుగోళ్లతో లాభాల ముగింపు

Wednesday 11th December 2019
Markets_main1576060766.png-30176

  • 11900 పైన ముగిసిన నిఫ్టీ 
  • 173 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 
  • ఆదుకున్న ఐటీ, ఫైనాన్షియల్‌ షేర్ల ర్యాలీ

చివరి గంటలో వెలువెత్తిన కొనుగోళ్లతో మార్కెట్‌ బుధవారం లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 40,412 వద్ద స్థిరపడింది. నిప్టీ 53 పాయింట్లు పెరిగి 11,900పైన 11,910 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి గంటలో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ, ఆర్థిక, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ రంగాలకు అనూహ్యంగా మద్దతు లభించింది. ఈ రంగాలకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, కోటక్‌ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ షేర్ల ర్యాలీ సూచీల రికవరీకి కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.31శాతం లాభంతో 31,256.75 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు అంతంత మాత్రంగానే ఉంది. ఇంట్రాడే నిఫ్టీ 11,832.30 - 11,923.20 రేంజ్‌లో కదలాడగా, సెన్సెక్స్‌  40,135.37 - 40,466.13 శ్రేణిలో కదలాడింది. మెటల్‌ ప్రభుత్వరంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఐటీ షేర్లు లాభపడ్డాయి.

ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎన్‌టీపీసీ, జీ లిమిటెడ్‌, గెయిల్‌ షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం వరకు లాభపడ్డాయి. హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌, వేదాంత, హీరోమోటోకార్ప్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 14శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

16 నుంచి ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ ఇష్యూ

Wednesday 11th December 2019

ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ రూ.1,500 కోట్ల వరకు నిధులు సమీకరించే లక్ష్యంతో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) ఇష్యూను చేపట్టింది. ఈ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభమైన 30వ తేదీన ముగుస్తుంది. అనంతరం ఎన్‌సీడీలను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ చేయనున్నారు. కనీసం రూ.500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక. అధికంగా స్పందన వస్తే.. అప్పుడు అదనంగా మరో రూ.1,000 కోట్లను సమీకరించనుంది. ఇష్యూ ద్వారా సమీకరించే

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ బంపర్‌ లిస్టింగ్‌..!?

Wednesday 11th December 2019

50శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ అంటున్న విశ్లేషకులు   ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ బంపర్‌గా లిస్టయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఐపీఓ విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు ఇప్పడు మార్కెట్‌ వర్గాల దృష్టి లిస్టింగ్‌పై పడింది. రేపు జరిగే(డిసెంబర్‌ 12న) జరిగే లిస్ట్‌లో ఇష్యూ ధర రూ.37లతో పోలిస్తే 50శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ జరగవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.750 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌

Most from this category