News


రెండోరోజూ అదే జోరు..!

Monday 23rd September 2019
Markets_main1569234677.png-28498

  • 39000పైన సెన్సెక్స్‌, 11600 పైన ముగిసిన నిఫ్టీ
  • సూచీల చరిత్రలో రెండురోజుల్లో అతిపెద్ద ర్యాలీ

మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు గత వారాంతంలో కేంద్రం ప్రకటించిన ఉద్దీపనల ఉత్సాహంతో మార్కెట్లో రెండోరోజూ బుల్‌రన్‌ కొనసాగింది. సోమవారం సెన్సెక్స్‌ 1,075 పాయింట్లు పెరిగి 39000 స్థాయిని అధిగమించిన 39090.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 329.20 పాయింట్లు 11,600 పైన 11,603.40 వద్ద స్థిరపడింది. సూచీల చరిత్రలో రెండురోజుల పాటు జరిగిన అతిపెద్ద ర్యాలీ ఇదే కావడం విశేషం. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 2996 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 895 పాయింట్లు లాభపడింది. క్రితం వారం ముగింపు భారీ ముగింపునకు కొనసాగింపుగా నేడు సెన్సెక్స్‌ 830 పాయింట్లు లాభంతో 38,844.00 వద్ద నిప్టీ 259 పాయింట్ల లాభంతో 11,542.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారంలో సెప్టెంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ గడువు ముగింపు నేపథ్యంలో బేర్స్‌ షార్ట్‌ కవరింగ్‌ పూనుకోవడం, జీఎస్‌టీ మండలి సానుకూల నిర్ణయాల ప్రకటన, కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుపై విదేశీ బ్రోకరేజ్‌ సంస్థలైన మూడీస్‌, నోమూరాలు సానుకూలంగా స్పందించడంతో పాటు అలాగే ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్‌, నిఫ్టీలు 11శాతం ఆదాయాల్ని ఆర్జించవచ్చనే మార్కెట్‌ విశ్లేషకులు అంచనాలు లాంటి సానుకూలాంశాలు మార్కెట్లో రెండోరోజూ లాభాల మోత మోగించాయి. ఒక్క ఫార్మా, ఐటీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 1427 పాయింట్లు పెరిగి 39,441.12 వద్ద, నిఫ్టీ 579 పాయింట్లు లాభపడి 11,694.85 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1567 పాయింట్లు(5.50శాతం) పెరిగి 30,548.45 వద్ద స్థిరపడింది. మధ్య, చిన్న తరహా షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.68శాతం ర్యాలీ చేసింది. రెండురోజుల పాటు సూచీలు భారీగా ర్యాలీ చేసిన నేపథ్యంలో నేడు చివరి అరగంటలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. 
ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో బీపీసీఎల్‌, బజాజ్‌ఫైనాన్స్‌సర్వీసెస్‌, ఐషర్‌మోటర్స్‌, ఐఓసీ, ఎల్‌అండ్‌ షేర్లు 13శాతం నుంచి 8శాతం వరకు లాభపడ్డాయి. సిప్లా, పవర్‌గ్రిడ్‌, టాటామోటర్స్‌, ఇన్ఫోసిస్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 3శాతం నుంచి 10శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

భారీ ర్యాలీకి కారణాలు..

Monday 23rd September 2019

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో గత సెషన్‌ నుంచి మార్కెట్‌లు దూసుకుపోతున్నాయి. గత సెషన్‌లో ప్రారంభమైన మార్కెట్‌ల ర్యాలీ సోమవారం కూడా కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1,075 పాయింట్లు పెరిగి 39000 స్థాయిని అధిగమించి 39090.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 329.20 పాయింట్లు లాభపడి 11,600 పైన 11,603.40 వద్ద స్థిరపడింది. సూచీల చరిత్రలో రెండురోజుల పాటు

డిజిన్వెస్ట్‌మెంట్‌ అంచనాలు...బీపీసీఎల్‌ 13 శాతం అప్‌

Monday 23rd September 2019

ట్యాక్స్‌ తగ్గింపుతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు సోమవారం ట్రేడింగ్‌లో భారీ లాభాల్లో ట్రేడయ్యాయి.  ప్రభుత్వం, ఈ ట్యాక్స్‌ తగ్గింపు వలన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొనుందని, ఈ ఒత్తిళ్లను తగ్గించుకోడానికి ప్రభుత్వ రంగ సం‍స్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పక్రియను వేగతరం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో భారత్‌పెట్రోలియం సోమవారం భారీగా పెరిగింది. ఈ షేరు 13.66 శాతం లాభపడి రూ. 459.00 వద్ద ముగిసింది. కాగా సోమవారం రూ.

Most from this category