News


ఒడిదుడుకుల ట్రేడింగ్‌: ఫ్లాట్‌ ముగింపు

Friday 25th October 2019
Markets_main1571999425.png-29146

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి దాదాపు ఫ్లాట్‌ ముగిశాయి. సెన్సెక్స్‌ 37.67 పాయింట్ల లాభంతో 39,058.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1.30 పాయింట్ల లాభంతో 11,583.90 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌, ఐటీ, మీడియా, ఆర్థిక, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, అటో రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ షేర్లకు ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమై బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం పెరిగి 29,396 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 523 పాయింట్లు రేంజ్‌లో 38,718.27 - 39,241.61 శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 156 పాయింట్ల స్థాయిలో  11,490.75 - 11,646.90 రేంజ్‌లో కదలాడింది. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 240 పాయింట్లును కోల్పోగా, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయింది. 
523 పాయింట్లు రేంజ్‌లో సెన్సెక్స్‌:- 
అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత కొనసాగుతునప్పటికీ.., నేడు దేశీయ మార్కెట్‌ లాభంతోనే మొదలైంది. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో మన దేశం గతేడాది సాధించిన ర్యాంకు కంటే 14ర్యాంకులు మెరుగుపరుచుకుని   63వ స్థానాన్ని సొంతం చేసుకోవడటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడిన నేపథ్యంలో నేడు సూచీలు లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 181 పాయింట్లు లాభంతో 39,201 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు లాభంతో 11,646.15 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఎఫ్‌ఎంజీసీ, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఉదయం ట్రేడింగ్‌లోనే సెనెక్స్‌ 221 పాయింట్లు పెరిగి 39,241.61 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 11,646.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అనంతరం సూచీల గరిష్ట స్థాయి వద్ద కొంత లాభాల స్వీకరణ జరిగినప్పటికీ.., మార్కెట్‌ను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవి లేకపోవడంతో మిడ్‌సెషన్‌ వరకు సూచీల ర్యాలీ సజావుగా జరిగింది. ముఖ్యంగా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లతో పాటు బ్యాంకింగ్‌, ఫార్మా రంగ షేర్లల్లో ఒక్కసారి అమ్మకాలు నెలకొనడంతో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం నుంచి 523 పాయింట్లు నష్టపోయి 38,718.27 వద్ద నిఫ్టీ ఇండెక్స్‌ గరిష్టం స్థాయి 11,646.15 నుంచి 157 పాయింట్లు నష్టపోయి 11,490 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. అనంతరం ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ ఆశాజనక క్యూ2 ఫలితాల ప్రకటనతో సూచీలు నష్టాలను పూడ్చుకోగలిగాయి. 
అల్ట్రాటెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, టాటామోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 8.50శాతం నష్టపోయాయి. సన్‌ఫార్మా, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 11శాతం లాభపడ్డాయి.


 You may be interested

జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ

Saturday 26th October 2019

- డిజిటల్ కోసం అనుబంధ సంస్థ  - దాని రుణాలన్నీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు న్యూఢిల్లీ: టెలికం వ్యాపార సంస్థ రిలయన్స్ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిలయన్స్ జియో సహా డిజిటల్‌ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు)

ఇంకా భారీ డిస్కౌంట్‌లోనే చాలా షేర్లు!

Friday 25th October 2019

నిఫ్టీ వాల్యూషన్లు మాత్రం చాలా ఎక్కువ అందువల్ల మరికొంత కాలం ఆటు పోట్లు తప్పవు సిద్ధార్ధ కేమ్కా అంచనాలు నిఫ్టీలో ఇంకా పలు స్టాకులు తమతమ దీర్ఘకాలిక సరాసరి వాల్యూషన్ల కన్నా 30- 40 శాతం తక్కువకు ట్రేడవుతున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రిసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ కేమ్కా చెప్పారు. అయితే నిఫ్టీ మాత్రం 20 రెట్లు పీఈతో ట్రేడవుతూ అధిక వాల్యూషన్ల వద్ద ఉందన్నారు. అందువల్ల స్వల్పకాలానికి సూచీలు ఒడిదుడుకులను చూస్తాయన్నారు. ఎకనమిక్‌

Most from this category