News


మార్కెట్‌ పతనానికి 5 కారణాలు

Friday 19th July 2019
Markets_main1563529157.png-27186

దేశియ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బెంచ్‌మార్కు సూచీలు బారీగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.51 సమయానికి నిఫ్టీ 50 ఇండెక్స్‌ 163.15 పాయింట్లు కోల్పోయి 11,433.75 పాయింట్లు వద్ద, 498.20 పాయింట్లు కోల్పోయి 38,399.26 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. మార్కెట్లు ఇంత బారీ స్థాయిలో నష్టపోవడానికి.. కారణమయిన ఐదు కారకాలు

‘సూపర్‌ రిచ్‌’ సర్‌చార్జీలపై ఆర్థిక మంత్రి ప్రకటన :
‘సూపర్‌ రిచ్‌’ సర్‌చార్జ్‌ నుంచి మినహాయింపు కావాలంటే ఎప్‌పీఐ(విదేశి పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు)లు తమను తాము ట్రస్టులుగా కాకుండా సంస్థలుగా మార్చుకునే ఎంపికను పరిగణించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 18 న జరిగిన ఆర్థిక బిల్లుపై చర్చలో అన్నారు. ట్రస్టులుగా నమోదు చేసుకున్న ఎఫ్‌పిఐలు కొత్త పన్ను సర్‌చార్జిని చెల్లించాల్సి ఉంటుందని పునరుద్ఘాటించడంతో ఈ సర్‌చార్జీలపై సర్దుబాటు ఉంటుందని ఆశించిన వారు భంగపడ్డారు.  జూలై నెలలో ఇప్పటివరకు రూ.5,000 కోట్లకు పైగా విదేశి పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం.

ఒత్తిడిలో మార్కెట్లు: 
శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్‌(జులై 19 )లో ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతానికి పైగా, ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం పతనమయ్యాయి.  ఈ వారమంతా మార్కెట్లు ఒత్తిడిలోనే కొనసాగాయి. ఐషర్ మోటర్స్, మారుతి సుజుకి, హెచ్ఈజీ, ఎం అండ్ ఎం, టీవీఎస్ మోటర్, హిందుస్తాన్ జింక్, గెయిల్ ఇండియా, యెస్ బ్యాంక్ వంటి పేర్లతో పాటు 300 కి పైగా స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి.

బలహీన రుతుపవన పురోగతి:
 సంచిత వర్షపాతం(జూలై 17 వరకు గల డేటా) సాధారణ స్థాయి కంటే 15.8 శాతం, వారపు వర్షపాతం సాధారణం కంటే 19.8 శాతం తక్కువగా నమోదయ్యింది.  ఇప్పటి వరకు భారతదేశం అంతటా ఉన్న 36 సబ్ డివిజన్లలో 18 తక్కువ వర్షపాతం, 16 సాధారణ వర్షపాతం, మూడు అధిక వర్షపాతం,  ఒకటి కొద్దిపాటి వర్షపాతం నమోదు చేశాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక తెలిపింది.

సాంకేతిక కారకాలు: నిఫ్టీ 100 ఈఎంఏ దిగువకు పడిపోవడం
 కీలక మద్దతు స్థాయిలైన 11,700 ,11,650, 11,600, 11,500 స్థాయిలను  నిఫ్టీ 50 కోల్పోయింది.  ఈ ఇండెక్స్‌ 100 రోజుల ఈఎంఏ కంటే దిగువన 11,526 వద్దకు పడిపోయింది. అంతేకాకుండా జులై 9 న ఏర్పడిన 11,461 కనిష్ట స్థాయిని కూడా కోల్పోతే 200 రోజుల డీఎంఏ స్థాయి కదులుతున్న 11,125 స్థాయికి పడిపోతుంది. ‘ నిఫ్టీ పైకి వెళితే 11,700 పాయింట్ల వద్దకు చేరుకోవచ్చు. మార్కెట్లు పెరిగితే ఇన్వెస్టర్లు షార్ట్‌ పొజిషన్లు తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ఇండెక్స్‌ కొత్త కనిష్ఠాలను తాకవచ్చు’ అని టెక్నికల్ రీసెర్చ్ అండ్‌ ట్రేడింగ్ అడ్వైజరీ, చీఫ్ స్ట్రాటజిస్ట్ మజ్హర్ మొహమ్మద్ అన్నారు. 

బలహీనమైన కార్పొరేట్ ఫలితాలు:
కార్పొరేట్‌ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇన్ఫోసిస్‌ అంచనాల కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వడంతో.. చాలా వరకు ప్రపంచస్థాయి రేటింగ్‌ సంస్థలు తమ రేటింగ్‌ను కొనసాగిస్తు 12 నెలల టార్గెట్‌ ధరను పెంచాయి.  ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికి యస్‌ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, మైండ్‌ట్రీ, విప్రో, డిసిబి బ్యాంక్ ఫలితాలు మాత్రం మార్కెట్లను నిరాశకు గురిచేశాయి.  ‘మార్కెట్లు విస్తృతంగా నెగిటివ్‌లో ఉన్నప్పటికి ఐటి సర్వీసెస్, ఎఫ్ఎంసిజి కంపెనీలతో పాటు బ్యాంకులు సానుకూలంగా ట్రేడవ్వడంతో గత కొన్ని రోజుల నుంచి మార్కెట్‌ సూచీలు పాజిటివ్‌గా ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద భయాలు, ప్రపంచ ఆర్థిక మందగమనంపై పెరుగుతున్న ఆందోళనలు, ఐరోపాలో బలహీనమైన ఆదాయాలు, జూన్ నెలలో జపాన్ ఎగుమతుల్లో క్షీణత వంటి కారణాల వలన మార్కెట్లు ప్రభావితం అయ్యాయి’ అని షేర్‌ఖాన్ బిఎన్‌పి పారిబాస్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీస్ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్,  సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌరవ్ దువా అన్నారు. ‘దేశీయంగా యస్‌ బ్యాంక్, మైండ్‌ట్రీల ఫలితాలు నిరాశపరచడంతో  మిడ్‌క్యాప్ రంగం బలహీనంగా కొనసాగవచ్చు’ అని వివరించారు. 

 You may be interested

నిరాశపరిచిన గైడెన్స్‌: ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 14.50శాతం క్రాష్‌

Friday 19th July 2019

తొలి తైమాసిక ఫలితాలను ఆశించిన స్థాయిలో నమోదు చేసినప్పటికీ.., వచ్చే 2-3 త్రైమాసికాల్లో వృద్ధి బలహీనంగా వుండవచ్చంటూ  ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ఆర్‌బీఎల్‌ యాజమాన్యం హెచ్చరించడంతో ఆ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 14.50శాతం క్షీణించింది. ఈ ఏడాది పనితీరుపై తాజా అంచనాలు(గైడెన్స్‌) నిరాశపరచడంతో షేరు పతనానికి కారణమైంది. నేడు బ్యాంకు మొదటి క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ1లో రూ.267 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఇదే త్రైమాసిక కాలంలో ప్రకటించిన రూ.190

ఫండ్‌మేనేజర్లు కొన్నషేర్లు ఎలా ఉన్నాయి?!

Friday 19th July 2019

జూన్‌ త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు దాదాపు 80 కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. వీటిలో కేవలం 19 కంపెనీలు మాత్రమే ఇంతవరకు దాదాపు 10- 50 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరో 30 కంపెనీలు 10- 60 శాతం నష్టాల్లో ఉండగా, మిగిలినవి ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. మరోవైపు జూన్‌ త్రైమాసికంలో ఫండ్‌ మేనేజర్లు వాటాలు తగ్గించుకున్న 22 కంపెనీల షేర్లు ఈ ఏడాది దాదాపు 20- 60 శాతం నష్టాల్లో

Most from this category