News


బడ్జెట్‌ ఎఫెక్ట్‌...సెన్సెక్స్‌ 1000 పాయింట్లు క్రాష్‌

Saturday 1st February 2020
Markets_main1580553291.png-31405

  • 40వేల దిగువన ముగిసిన సెన్సెక్స్‌
  • 318 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

బడ్జె్ట్‌ మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ శనివారం భారీ నష్టంతో ముగిసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు 2శాతం పతనాన్ని చవిచూశాయి. అన్ని రంగాలపై కస్టమ్‌ డ్యూటీ పెంచడంతో పాటు ఇన్ఫ్రారంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపకపోవడంతో మార్కెట్లో అమ్మకాల సునామీ సాగాయి. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ)ని రద్దు అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం మార్కెట్‌ వర్గాలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. కరోనా వైరస్‌ వ్యాధి భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నెలకొన్న బలహీన సంకేతాలు సైతం మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సరికి నిఫ్టీ 322 పాయింట్లు నష్టపోయి 11,640 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 988 పాయింట్లు కోల్పోయి 40వేల స్థాయి దిగువున 39,735 వద్ద ముగిసింది. బడ్జెట్‌లో ఒక్క ఐటీ రంగానికి మాత్రమే అనుకూలంగా ఉండటంతో ఈ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. పన్ను చెల్లించదగిన లావాదేవీలకు రేటు పరిమితి 5 శాతం నుండి 10 శాతానికి పెంచడంతో రియల్‌ ఎస్టేట్‌ షేర్లు బారీ పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ రియల్‌ ఎస్టేట్‌ ఇండెక్స్‌ ఏకంగా 8శాతం నష్టాన్ని చవిచూసింది. నవంబర్‌ 2016 తర్వాత సూచీలు అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టీఎస్ఎస్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్పోసిస్‌ షేర్లు తప్ప మిగిలిని అన్ని షేర్లు నష్టంతో ముగిశాయి. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీలను మరింత పెంచడంతో ఐటీసీ ఏకంగా 7శాతాన్ని చూసింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ లాంటి అధిక వెయిటేజీ కలిగిన షేర్లు 4శాతం నుంచి 6శాతం నష్టపోడం సూచీలు భారీ పతనానికి కారణమైంది.

జీ లిమిటెడ్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటర్స్‌, ఐటీసీ షేర్లు 6శాతం నుంచి 7శాతం నష్టపోయాయి. విప్రో, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, హిందుస్థాన్‌ యూనిలివర్‌, టీసీఎస్‌ షేర్లు 0.15శాతం నుంచి 4శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

అంచనాలు అధికం... అందుకోలేని బడ్జెట్‌!

Saturday 1st February 2020

దేశీయ సూచీలు శనివారం భారీ పతనం నమోదు చేశాయి. బడ్జెట్లో కోట్ల రూపాయాల మేర సాగు, ఇన్‌ఫ్రా రంగాలకు మద్దతు పథకాలు ప్రకటించినా, డీడీటీ ఎత్తివేసినా, ఐటీ స్లాబులు తగ్గించినా.. సూచీలకు పెద్దగా రుచించలేదు. నిర్మలమ్మ సంస్కరణలు మార్కెట్‌ అంచనాలను సంతృప్తి పరచలేకపోయాయని రాయిటర్స్‌ వ్యాఖ్యానించింది. బడ్జెట్‌, మార్కెట్‌పై వివిధ అనలిస్టుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... = వినోద్‌ నాయర్‌, జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌: మార్కెట్లో అంచనాలతో పోలిస్తే బడ్జెట్‌ చాలా పేలవంగా

సీతారామన్‌... సుదీర్ఘ స్పీచ్‌!

Saturday 1st February 2020

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త రికార్డు సృష్టించారు. సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఈ రోజు నిర్మల దాదాపు 2 గంటల 42 నిమిషాల మేర బడ్జెట్‌ ప్రసంగం చేశారు. దీంతో గతంలో ఆమె పేరునే ఉన్న సుదీర్ఘ ప్రసంగం రికార్డును బద్దలు కొట్టారు. గతేడాది జూలైలో నిర్మల తన తొలి బడ్జెట్‌ ప్రసంగం చేశారు. ఆ సమయంలో ఆమె 2

Most from this category