News


సెన్సెక్స్‌ నష్టం 476 పాయింట్లు

Thursday 19th September 2019
Markets_main1568888914.png-28437

  • 136 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

మార్కెట్‌ లాభాల ముగింపు ఒకరోజుకే పరిమితమైంది. సూచీలు గురువారం మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌  470 పాయింట్లను కోల్పోయి 36,093.47 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు నష్టపోయి 10,705 వద్ద స్థిరపడ్డాయి. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిన్నరాత్రి అందరి అంచనాలకు తగ్గట్లుగానే వడ్డీరేట్లపై పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే లేబర్‌ మార్కెట్‌ బలంగా ఉన్నందున రేట్ల కోత ఈ ఏడాది ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో భవిష్యత్‌లో వడ్డీరేట్లపై తగ్గింపుపై సందేహాలు రేకెత్తాయి. ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ నేడు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ బలహీనపడింది.ఇక దేశీయంగా నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశం సందర్భంగా ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే ప్రకటనలేవీ లేకపోవడం, రేపు(సెప్టెంబర్‌ 20న) జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో ట్రేడర్ల అప్రమత్తత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగుతుండటం తదితర కారణాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు క్రమక్రమంగా భారీ నష్టాల దిశగా సాగాయి. మిడ్‌సెషన్‌ అనంతరం అమ్మకాలు మరింత పెరగడంతో నిఫ్టీ ఒకదశలో 170 పాయింట్లు నష్టపోయి 10,670.25 వద్ద, సెన్సెక్స్‌ 576 పాయింట్లు నష్టపోయి 36000 దిగువున 35,987.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 26800 దిగువున 415 పాయింట్లు(1.51శాతం) నష్టపోయి 26,757.65 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో సెన్సెక్స్‌లో 30 షేర్లకు కేవలం 4షేర్లు మాత్రమే లాభపడగా, మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.15శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయాయి.

టాటాస్టీల్‌, ఇండస్‌ఇండ్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్స్‌ఫైనాన్స్‌, జీ లిమిటెడ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 15.50శాతం వరకు నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టాటామోటర్స్‌ షేర్లు అరశాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. 
 



You may be interested

ఈ స్థాయిల్లోనే మార్కెట్లు బోటమ్‌ అవుట్‌: సభర్వాల్‌

Friday 20th September 2019

దేశంలో కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోతున్నప్పటికీ... వచ్చే ఏడాది అమ్మకాల్లో 30 శాతం వరకు వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆస్క్‌సందీప్‌సభర్వాల్‌ డాట్‌కామ్‌ వ్యవస్థాకపుడు సందీప్‌ సభర్వాల్‌. మార్కెట్లు ఈ స్థాయిలో బోటమ్‌ అవుట్‌ కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    కార్ల అమ్మకాలు పడిపోవడానికి ఓలా, ఊబర్‌ కారణం కాదన్నారు సభర్వాల్‌. మార్కెట్లో నిధుల లభ్యత తగ్గిపోవడమే అమ్మకాలు 25

ఈ ఆరు రంగాల షేర్లూ పెట్టుబడికి అనుకూలం!

Thursday 19th September 2019

సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగాక చమురు ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు తమ కీలక మద్ధతు స్థాయిలను కొల్పోవలసి వచ్చింది. చాలా వరకు స్టాకులు భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. ఇవి ప్రస్తుతం మంచి వాల్యుషన్‌ల దగ్గర లభ్యమవుతున్నాయని, కానీ రాయితీతో ట్రేడయ్యే ప్రతీ స్టాకు మంచి రిటర్న్‌లను ఇవ్వదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిర్థిష్ట రంగాల వారిగా ప్రాథమిక అంశాలు బలంగా ఉండడంతో

Most from this category