News


లాభాల స్వీకరణ: సెన్సెక్స్‌ 466 పాయింట్లు క్రాష్‌

Friday 29th November 2019
news_main1575013458.png-29953

  • 134 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణకు తోడు నేడు దేశీయ రెండో క్వార్టర్‌ జీడీపీ గణాంకాలల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సూచీలు మిడ్‌ సెషన్‌ కల్లా భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లతో పాటు, అమెరికా ఫ్యూచర్ల నష్టాల ట్రేడింగ్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 466 పాయింట్లను కోల్పోయి 40,664.18 వద్ద, నిఫ్టీ 134 పాయింట్లు పాయింట్లను 12,017.40 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. నేటి సాయంత్రం కేంద్రం సెప్టెంబర్‌ త్రైమాసికపు జీడీపీ గణాంకాలను విడుదల చేయనుంది. దేశీ, అంతర్జాతీయంగా మాంద్య పరిస్థితులు, వినియోగ డిమాండ్‌ క్షీణత, ప్రైవేట్‌ పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం తదితర ప్రతికూలాంశాలతో క్యు2లో జీడీపీ 5శాతంలోపు నమోదు కావచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సూచీలు ఈ వారంలో వరుసగా రెండుసార్లు జీవితకాల గరిష్టం వద్ద ముగిసిన నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకుంటున్నారు. అంతర్జాతీయంగా పరిణామాలను చూసినట్లైతే... హాంగ్‌కాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి మద్దతునిచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తాజాగా సంతకం చేయడంపై చైనా తీవ్రంగా వ్యతిరేకింది. దీంతో ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో నేడు ఆసియ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. థ్యాంక్స్‌ టు గివింగ్‌ డే సందర్భంగా నిన్నటి రోజున అమెరికా మార్కెట్లకు సెలవు కావడంతో అమెరికా ఫ్యూచర్లు స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ఈ ప్రతికూల పరిమాణాలు సూచీలను నష్టాలపాలుజేశాయి. మధ్యాహ్నం గం.1:00లకు సెన్సెక్స్‌ 328.73 పాయింట్ల నష్టంతో 40,801.44 వద్ద, నిఫ్టీ 100.85 పాయింట్లను కోల్పోయి 12,050.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 250 పాయింట్లు (0.75శాతం) నష్టపోయి 31,876.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో షేర్లు 1.50శాతం నుంచి 2.20శాతం నష్టపోయాయి. యస్‌బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, భారతీఎయిర్‌టెల్‌, అదానీపోర్ట్స్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 0.75శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి. 
 



You may be interested

కోటక్‌ సెక్యూరిటీస్‌ టాప్‌ 3 సిఫార్సులు

Friday 29th November 2019

ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు, పీఎస్‌బీల్లో ఎస్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరుపై పాజిటివ్‌గా ఉన్నామని కోటక్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ జర్బాడే చెప్పారు. కార్పొరేట్‌ బ్యాంక్స్‌లో ఎన్‌పీఎల్‌ బలహీనంగా ఉన్నందున వీటిపై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలు ఇటీవల మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. రాబోయే ఏడాదికూడా వీటి నుంచి మంచి ఫలితాలు ఆశించవచ్చన్నారు. వాహనాల ఫైనాన్సింగ్‌ చేసే ఎన్‌బీఎఫ్‌సీలు ఇకపై కొంత నెగిటివిటీ చూడవచ్చన్నారు. వాహన విక్రయాల్లో

నష్టాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 29th November 2019

జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, శుక్రవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నం 12.20 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 260.95 పాయింట్లు నష్టపోయి 31,862.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్‌లో 32,122.95 వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌, శుక్రవారం సెషన్‌లో 32,074.15 వద్ద ప్రారంభమైంది. ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ 105.70 పాయింట్లు నష్టపోయి 12,045.45 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 377.77 పాయింట్లు

Most from this category