STOCKS

News


కొత్త రికార్డు వద్ద లాభాల స్వీకరణ

Tuesday 26th November 2019
Markets_main1574765096.png-29876

స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
ఆదుకున్న రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ
కొత్త గరిరిష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

జీవితకాల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు మంగళవారం స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 68 పాయింట్లు నష్టంతో 40,821.30 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లను కోల్పోయి 12,037.70 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌, మెటల్‌, మీడియా, అటో రంగ షేర్ల నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ అరశాతం లాభంతో 31718 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 126 పాయింట్ల రేంజ్‌లో 12,006.35-12,132.45 శ్రేణిలో కదలాడింది. సెనెక్స్‌ 410 పాయింట్లు స్థాయిలో 40,710 - 41,120 రేంజ్‌లో ట్రేడైంది.
ఇంట్రాడేలో కొత్త గరిష్టాలకు సూచీలు:- 
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో సూచీలు మంగళవారం సరికొత్త  జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ ర్యాలీ సూచీల రికార్డు ర్యాలీకి సహకరించందని చెప్పవచ్చు. ఫలితంగా సెనెక్స్‌ 231 పాయింట్లు పెరిగి 41,120 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 12,132.45 తమ జీవికాల గరిష్టాలను నమోదు చేశాయి. జూన్‌3న నెలకొల్పిన 12,103 పాయింట్ల రికార్డును నిఫ్టీ తాజాగా అధిగమించింది. అలాగే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 31,813.70 వద్ద నూతన ఆల్‌టైంకి చేరుకుంది. 
గరిష్ట స్థాయి వద్ద లాభాల స్వీకరణ:- 
సూచీలు గరిష్టస్థాయిని అందుకున్న పిమ్మట ట్రేడర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే మన మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయంలో యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. ఫలితంగా అన్ని రంగాల్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అటో, ఐటీ, మెటల్‌ షేర్లు సూచీల లాభాలను హరించివేశాయి. దీంతో సెన్సెక్స్‌ ఆల్‌టైం హై(12,132.45) నుంచి 410 పాయింట్లు నష్టపోయి 40,710 వద్ద, నిఫ్టీ జీవితకాల గరిష్టం(12,132) నుంచి 126 పాయింట్లను కోల్పోయి 12,006 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. 
ఆదుకున్న ఐసీఐసీఐ బ్యాంక్‌:- 
సూచీల భారీ పతనాన్నిఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అడ్డుకున్నాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ ఉన్న ఈ షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైం‍ హైని తాకి సూచీల నష్టాలను కొంతవరకు తగ్గించాయి. అలాగే ట్రేడింగ్‌ చివరి అరగంటలో కొన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల పరిమితమయ్యాయి. 

జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, గ్రాసీం, ఇన్ఫ్రాటెల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 3శాతం నుంచి 7.50శాతం వరకు నష్టపోయాయి. టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గెయిల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

మిడ్‌క్యాప్‌లో ర్యాలీకి ఫస్ట్‌ గేర్‌

Tuesday 26th November 2019

ప్రధాన సూచీలు, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీల మధ్య అంతరం పెరిగిపోయింది. రెండేళ్ల పాటు చిన్న సూచీలు లార్జ్‌క్యాప్‌తో వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య అంతరం దీర్ఘకాలికంగా సగటును పరిశీలించినప్పుడు చాలా గణనీయ స్థాయికి చేరిందని సిటీ గ్రూపు అంటోంది. ఎంఎస్‌సీఐ ఇండియా మిడ్‌క్యాప్‌ సూచీ గత రెండు సంవత్సరాల్లో 17 శాతాన్ని కోల్పో‍యింది. కానీ, బెంచ్‌మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 శాతం మేర లాభపడింది.    దీర్ఘకాల ప్రతికూల పనితీరు

ఈ ర్యాలీ ఆశ్చర్యకరం!

Tuesday 26th November 2019

ఎఫ్‌ఐఐల నిధులే కారణం మహేశ్‌ పటేల్‌ మంగళవారం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలు నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలు ఆల్‌టైమ్‌ హైని తాకాయి. యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై సానుకూల అంచనాలు, క్యు2లో ఎర్నింగ్స్‌ బాగుండడం తదితర కారణాలు సూచీలను నడిపించాయి. సెప్టెంబర్‌ 19 కనిష్ఠాల నుంచి సూచీలు దాదాపు 13 శాతం ర్యాలీ జరిపాయి. ఈ అప్‌మూవ్‌ అనూహ్యమని, గణాంకాల ఆధారితంగా రాలేదని, కేవలం అంతర్జాతీయ లిక్విడిటీ పెరగడం, అంతర్జాతీయ సానుకూల పవనాల కారణంగా వచ్చిందని

Most from this category