STOCKS

News


నాలుగో రోజూ నష్టాలే...

Tuesday 23rd July 2019
Markets_main1563879133.png-27259

  • 38000ల దిగువ ముగిసిన సెన్సెక్స్‌ 
  • 15 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 

మార్కెట్‌కు నష్టాల కష్టాలు ఆగేలా లేవు. వరుసగా 4రోజూ నష్టాలతోనే ముగిసింది. మార్కెట్లో కొనసాగుతున్న వరుస పతనంతో సెన్సెక్స్‌ 48 పాయింట్లు నష్టపోయి 38000 స్థాయి దిగువున 37,982 వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్లను కోల్పోయి 11,331 వద్ద స్థిరపడింది. ఈ 4 ట్రేడింగ్‌ సెషన్స్‌లో సెన్సెక్స్‌ సూచీ 1232 పాయింట్లను, నిఫ్టీ 357 పాయింట్లును కోల్పోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఫార్మా, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో, మెటల్‌ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం క్షీణించి 29,128.10 వద్ద స్థిరపడింది.  మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల జోరుగా సాగాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.60శాతం నష్టపోగా, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.50శాతం మేర క్షీణించాయి. కార్పోరేట్‌ క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడటం, ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్ల క్షీణత, చివరి గంట అమ్మకాలు సూచీల నష్టాల ముగింపునకు కారణమయ్యాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,899 - 38,218 స్థాయిలో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 11,302 - 11,398 శ్రేణిలో రేంజ్‌లో ట్రేడైంది. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల జోరుగా సాగాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.60శాతం నష్టపోగా, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.50శాతం మేర క్షీణించాయి. 
బజాజ్‌ అటో, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఎస్‌బీఐ షేర్లు 1.65శాతం నుంచి 2.50శాతం వరకు నష్టపోగా, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, హీరోమోటోకార్ప్‌, కోటక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. You may be interested

వాళ్లు చిన్న స్టాక్స్‌ను కొంటూనే ఉన్నారు...!

Tuesday 23rd July 2019

ప్రముఖ ఇన్వెస్టర్లుగా చెప్పుకునే అనిల్‌కుమార్‌ గోయల్‌, పొరింజు వెలియాత్‌ తదితరులు మార్కెట్‌ అనిశ్చిత పరిస్థితుల్లోనూ స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కొనుగోళ్లను కొనసాగిస్తున్నట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ అమ్మకాల ఒత్తిడికి గత ఏడాదిన్నరగా నష్టాల పాలవుతూనే ఉన్న విషయం గమనార్హం. గోయల్‌, పొరింజు వెలియాత్‌లు స్మాల్‌, మైక్రోక్యాప్‌ స్టాక్స్‌ కొనుగోళ్లకు ఎక్కువగా ప్రాధాన్యం చూపించే విషయం తెలిసిందే. ఆర్థిక రంగం పరుగులు తీయడం మొదలు పెడితే, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మధ్య,

కమోడిటీస్‌: పాజిటివ్‌గా బేస్‌ మెటల్స్‌

Tuesday 23rd July 2019

ఈ నెల చివరిలో జరగనున్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ సమావేశంలో, వడ్డి రేట్ల కోత తక్కువగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో డాలర్‌ గత కొన్ని సెషన్‌ల నుంచి బలపడుతోంది. ఫలితంగా బులియన్‌ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గాయి. దీంతో పాటు మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఒత్తిళ్ల వలన చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా అవసరమైనప్పుడు ప్రతిస్పందిస్తామని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఎజెన్సీ (ఐఈఏ) తెలపడం‍తోపాటు చమురు డిమాండ్‌ భయాల వలన మంగళవారం చమురు ధరలు

Most from this category