News


నిఫ్టీ 100 పాయింట్లు క్రాష్‌

Monday 29th July 2019
Markets_main1564387912.png-27381

  • 364 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో మార్కెట్‌ నష్టాల పరంపర కొనసాగతుంది.  సోమవారం మిడ్‌సెషన్‌ కల్లా సెనెక్స్‌ 300 పాయింట్లను, నిఫ్టీ 100 పాయింట్లను కోల్పోయాయి. అటో, మెటల్‌, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్‌ నష్టాలకు ప్రధాన కారణమవుతోంది. ఇటీవల క్యూ1 ఫలితాలను ప్రకటిస్తున్న దేశీయ కార్పోరేట్‌ కంపెనీల క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జీల పెంపును సమర్థించడం ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అంతర్జాతీయంగా ఫెడ్‌ వడ్డీరేట్ల కోత పరిమిత స్థాయిలో ఉంటుందనే అంచనాలు, యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లపై యథాతథ పాలసీని కొనసాగించడం, డాలర్‌ ఇండెక్స్‌ 2నెలల గరిష్టస్థాయికి అందుకోవడం తదితర కారణాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీన వాతావరణం నెలకొంది. దీంతో నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. తాజాగా ఒకదశలో నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 11,152.40 వద్ద, సెన్సెక్స్‌ 364 పాయింట్లు క్షీణించి 37,519.16 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు దాదాపు 1శాతం క్షీణించాయి. మధ్యా‍హ్నం గం.1:15ని.లకు నిఫ్టీ గత క్రితం ముగింపు(11,284.30)తో పోలిస్తే 85 పాయింట్లు నష్టపోయి 11,199.00 వద్ద, సెన్సెక్స్‌ కిత్రం ముగింపు (37,883)తో పోలిస్తే 220 పాయింట్లు క్షీణించి 37,666 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, గ్రాసీం, టాటామోటర్స్‌, బజాజ్‌ అటో, వేదాంత లిమిటెడ్‌ షేర్లు 4.50శాతం నుంచి 8.50శాతం నష్టపోగా, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు అరశాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి.You may be interested

27 శాతం పతనమైన వోడాఫోన్‌-ఐడియా

Monday 29th July 2019

టెలికాం షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ఉన్నాయి.  వోడాఫోన్‌-ఐడియా బలహీన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో ఈ కంపెనీ షేరు విలువ ఉదయం 1.39 సమయానికి 27.03 శాతం నష్టపోయి, రూ. 6.75 వద్ద ట్రేడవుతోంది. టెలికాం షేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ. 4,873 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించగా, కంపెనీ ఆదాయం సైతం 11 శాతం క్షీణించి రూ.11,270 కోట్లకు పడిపోయింది. మిగిలిన వాటిలో టెలికాం ఇండెక్స్‌లో

ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తే మంచిది : నిర్మల సీతారామన్

Monday 29th July 2019

ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్‌బీఐ మరో సారి వడ్డీ రేట్లు తగ్గింపు అవసరమని తాను భావిస్తున్నానని, ఆటోమొబైల్ రంగంలో తిరోగమనంతో సహా ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మల సీతారామన్  ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆమె మాటల్లోనే.. అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తున్నాం.. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఆందోళనలున్నాయి. ఐఎంఎఫ్‌(ఇంటర్నేషనల్‌ మానెటరీ ఫండ్‌), ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ తమ

Most from this category