News


11600 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 18th July 2019
Markets_main1563447206.png-27164

మూడురోజుల ర్యాలీకి బ్రేక్‌
39000 దిగువన ముగిసిన సెన్సెక్స్‌ 
మార్కెట్‌ మూడురోజుల వరుసగా ర్యాలీ గురువారం బ్రేక్‌ పడింది. ఇప్పటికి వెలువడిన పలు కార్పోరేట్‌ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తెరపైకి రావడం, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్ భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాను మరోసారి కోత విధించడం మార్కె్‌ట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు, అటో, మెటల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సూచీలు మూడురోజుల పాటు ఆర్జించిన లాభాలన్ని నేడు హరించుకుపోయాయి. సెన్సెక్స్‌ 318.18 పాయింట్లు నష్టపోయి 39000 మార్కును కోల్పోయి 38897.46 వద్ద స్థిరపడింది. మరో ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 96 పాయింట్లను నష్టపోయి 11600ల దిగువన 11596.9 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 305 పాయింట్లు నష్టపోయి 30430 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్‌ రంగ షేర్లు తీవ్రంగా నష్టపోవడంతో నిఫ్టీమిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు 2.50శాతం క్షీణించింది. మరోవైపు మీడియా, ఆర్థిక రంగ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ‘‘మార్కెట్లో మరోసారి బేర్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా సెన్సెక్స్‌(39000), నిఫ్టీ(11600), బ్యాంక్‌ నిఫ్టీ(35000) సూచీలు కీలక స్థాయిలను కోల్పోయాయి. ఒకవేళ రేపు నిఫ్టీఇండెక్స్‌ 11600 దిగువన ప్రారంభమైతే రానున్న రోజుల్లో మార్కెట్‌లో అమ్మకాలు కొనసాగుతాయి. అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
మారుతి సుజుకీ, టాటామోటర్స్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 12.50శాతం నష్టపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్రిటానియా, జీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో షేర్లు 1శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

పెరిగిన మధ్య ప్రాచ్య ఒత్తిళ్లు..పెరిగిన చమురు

Friday 19th July 2019

 హార్ముజ్‌ జలసింధి వద్ద అమెరికా నావీ ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేయడంతో శుక్రవారం చమురు ధరలు 1 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.75 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 55.91 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.  గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 2.7 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 2.6 శాతం నష్టపోయి ముగిశాయి.    అమెరికా నావీ ఇరాన్‌

వచ్చే 6 నెలల్లో ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకోవచ్చు: కోటక్‌ ఏఎంసీ

Thursday 18th July 2019

ఎన్‌బీఎఫ్‌సీలు వచ్చే రెండు త్రైమాసికాలలో కూడా కష్టంగానే.. పవర్‌ యుటిలిటీస్‌ కన్నా గ్యాస్‌ యుటిలిటీస్‌ బాగున్నాయి. ఐటీ రంగం వృద్ధి కరెన్సీ స్థాయిపై అధికంగా ఆధారపడి ఉంటుంది.   ఆర్థిక వ్యవస్థ ఒకసారి పుంజుకోవడం ప్రారంభిస్తే వచ్చే మూడు లేదా ఆరు నెలలలో ఇన్వెస్టర్లు పోర్ట్‌పోలియోల విషయంలో కొంత రిస్క్‌ తీసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం పడిపోయిన షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారని కోటక్‌ ఏఎంసీ సీఐఓ హర్ష ఉపధ్యాయ ఓ ఆంగ్ల చానెల్‌కు

Most from this category