News


10750 స్థాయికి నిఫ్టీ క్రాష్‌

Thursday 19th September 2019
Markets_main1568868975.png-28428

స్వల్ప నష్టంతో ప్రారంభమైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల దిశగా కదులుతున్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఆర్థిక, ఫార్మా రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల భారీ పతనానికి కారణవుతున్నాయి. ఉదయం గం.10:10లకు సెన్సెక్స్‌ 290 పాయింట్ల నష్టంతో 36,277 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లను కోల్పోయి 10,755.75 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 316 పాయింట్లు(1.16శాతం) నష్టపోయి 26,856.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగుతోంది. నిన్న ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.956 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరించింది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లను పావుశాతం తగ్గించింది. ఇన్వెస్టర్లు రేపు(సెప్టెంబర్‌ 20న) జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంపై దృష్టిని సారించారు. మందగించిన ఆటోరంగాన్ని ఉత్తేజపరిచేందుకు ఈ రంగంపై జీఎస్‌టీ శ్లాబ్‌ను తగ్గించవచ్చని మార్కెట్‌ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. స్వల్పకాలం పాటు సూచీలు ఒడిదుడుకులకు లోనైప్పటికీ.., మధ్యకాలానికి అవుట్‌లుక్‌ ఇప్పటికి పాజిటివ్‌గా ఉన్నట్లు కోటక్‌ సెక్యూరిటీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. నిఫ్టీ అప్‌ట్రెండ్‌ నిరోధ స్థాయి 11,150-11,200 శ్రేణిలోనూ, డౌన్‌సైడ్‌ మద్దతు స్థాయి 10,600-10,650 స్థాయిలో ఉండచవ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటాస్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం వరకు నష్టపోయాయి. మారుతి, భారతీ ఎయిర్‌టెల్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, బ్రిటానియా, ఏషియన్‌ పేయింట్స్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

62 డాలర్ల వద్దకు చమురు

Thursday 19th September 2019

ఈ నెల చివరి నాటికి చమురు ఉత్పత్తిని పూర్తిగి పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడంతో చమురు గత రాత్రి ప్రపంచ మార్కెట్లో 62 డాలర్ల సమీపానికి పడిపోయింది.  గురువారం ఉదయం ట్రేడింగ్‌లో స్వల్పంగా లాభపడి ట్రేడవుతోంది. ఉదయం 10.06 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.03 శాతం లాభపడి బారెల్‌ 62.68 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.19 శాతం లాభపడి బారెల్‌ 58.15 డాలర్ల వద్ద​ట్రేడవుతున్నాయి.     ఈ నెల చివరి నాటికి

నేటి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు విభజన!

Thursday 19th September 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ముఖవిలువ రూ. 2 కలిగిన షేర్లను రూ. 1గా విభజించింది. నేటి నుంచి (సెప్టెంబర్‌ 19) షేరు విభజన అమలులోకి వచ్చింది. ఉదయం 9.40 సమయానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 0.24 శాతం లాభపడి రూ. 1,096.80 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో(సెప్టెంబర్‌ 18) ఈ షేరు 1.07 శాతం నష్టపోయి రూ. 2187.75 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.

Most from this category