News


మందగమన ఆందోళనతో నష్టాల ముగింపు

Wednesday 21st August 2019
Markets_main1566383639.png-27923

వృద్ధి మందగమన ఆందోళనతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ రెండోరోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 267.64 పాయింట్లు నష్టపోయి 37,060.37 వద్ద, నిఫ్టీ 98.30 పాయింట్లు పతనమైన 10,918.70 వద్ద స్థిరపడ్డాయి. మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు క్యూ1లో జీడీపీ వృద్ధి క్షీణించవచ్చనే అంచనాలతో మార్కెట్లో అమ్మకాలు తీవ్రతరమయ్యాయి. క్యూ1లో పెట్టుబడులు క్షీణించడం, సేవారంగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, వినియోగం తగ్గడం తదితర ప్రతికూలతల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7శాతంగా నమోదు కావచ్చని నోమురా అంచనా వేసింది. అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ముఖ్యంగా మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 27,719 వద్ద స్థిరపడింది. 

టాటాస్టీల్‌, గ్రాసీం, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, టాటామోటర్స్‌ షేర్లు 4.50శాతం నుంచి 9.50శాతం వరకు నష్టపోయాయి. ఐషర్‌మోటర్స్‌, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతి, హీరోమోటోకార్ప్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి. 


 



You may be interested

బాటమ్‌ ఔట్‌కు ఇంకో 2-3 నెలలు పడుతుంది

Wednesday 21st August 2019

మార్కెట్‌ బాటమ్‌ ఔట్‌ కావడానికి ఇంకో రెండు,మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని క్వాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సందీప్ టాండన్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...   అసాధరణంగా పెరిగిన షార్ట్‌ పొజిషన్‌లు.. విస్తృత మార్కెట్ దృక్పథంలో పరిశీలిస్తే..కొంత మొత్తంలో అసాధారణమైన షార్ట్‌పొజిషన్‌లు గమనించవచ్చు. రిలయన్స్‌ ర్యాలీ చేయడం చూశాం. అదేవిధంగా కొన్ని ఆటో షేర్లు కూడా. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్‌లలో ఐదేళ్ళలో

టాటామోటర్స్‌ షేర్ల రివర్స్‌ గేర్‌..!

Wednesday 21st August 2019

10శాతం క్షీణించిన షేర్లు  దేశీయ వాహన తయారీ రంగ దిగ్గజ కంపెనీ టాటామోటర్స్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 10శాతం క్షీణించాయి. ట్రేడ్‌వార్‌ ప్రభావంతో కంపెనీ అనుబంధ సంస్థ  జేఎల్‌ఆర్‌ ఆదాయాలు క్షీణించడం, కేర్‌ రేటింగ్‌ సం‍స్థ కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ ఎఎ నుంచి ఎఎ(-)కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించడం, ప్రపంచవ్యాప్తంగా అటో రంగ బలహీనంగా ఉండటం షేర్ల పతనానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు

Most from this category