News


మార్కెట్‌కు ముందే దీపావళి..!

Friday 20th September 2019
Markets_main1568976741.png-28461

  • ఉద్దీపన చర్యల ప్రకటనతో ఉవ్వెత్తున ఎగిసిన సూచీలు
  • 10 ఏళ్లలో సూచీలకిదే అతిపెద్ద లాభం
  • ఒక్క రోజులోనే రూ.7లక్షల కోట్ల సంపద జోడింపు
  • సెన్సెక్స్‌ లాభం 1,921 పాయింట్లు 
  • 569.40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రకటించిన ఉద్దీపన చర్యలతో మార్కెట్‌కు ముందే దీపావళి పండుగొచ్చింది. దేశీయ కంపెనీలకు కార్పోరేట్‌ పన్నును  25 శాతానికి ( సెస్సులు, సర్‌ఛార్జీలు కలిపి) తగ్గించడం, అలాగే అక్టోబర్‌ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ రంగ సంస్థల ఆదాయ పన్ను 15శాతానికి పరిమితంచేయడం, క‌నీస ప్రత్యామ్నాయ ప‌న్ను ( ఎంఏటీ) కూడా 18.5 శాతం నుంచి 15 శాతానికి త‌గ్గించడటం, జూలై బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంపన్న వర్గాలపై అదనపు పన్ను విధింపును వెనక్కితీసుకోవడం, జులై 5 కంటే ముందు బైబ్యాక్ ప్రక‌టించే లిస్టెడ్ కంపెనీల‌కు ప‌న్ను ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనలతో మార్కెట్లో కొనుగోళ్ల సునామి నెలకొంది. రూపాయి బలపడంతో ఒక్క ఐటీ రంగ షేర్లకు తప్ప మిగిలిన అన్ని రంగ షేర్లు భారీగా ర్యాలీ చేశాయి. ఇంట్రాడే ఒకదశలో సెన్సెక్స్‌ 2285 పాయింట్లు పెరిగి  38,378.02 వద్ద, నిఫ్టీ 578 పాయింట్లు లాభపడి 11,382 వద్ద గరిష్టాలను నమోదు చేశాయి. 
పదేళ్లలో అతిపెద్ద ర్యాలీ:- 
కేంద్ర మంత్రి ప్రకటన అనంతరం మార్కెట్లో మొదలైన అమ్మకాల పరంపర ఏదశలో ఆగలేదు. ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీలు పదేళ్లలో అతిపెద్ద ర్యాలీ ర్యాలీ చేశాయి. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 1,921 పాయింట్ల లాభంతో 38000 పైన 38,014.62 వద్ద, నిఫ్టీ 569.40 పాయింట్లు పెరిగి 11,274.20 వద్ద స్థిరపడ్డాయి. మే 18, 2009నాడు యూపీఏ-II ప్రభుత్వం అనూహ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు సూచీలు భారీగా లాభపడ్డాయి. ఈ ర్యాలీ తరువాత ఇదే అతిపెద్ద ర్యాలీ కావడం విశేషం. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ క్రితం ముగింపు(26,757.65)తో పోలిస్తే 2,224 లాభంతో 28,981.55 వద్ద ముగిసింది.
ఒక రోజులో రూ.7లక్షల కోట్లు 
దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ పన్ను తగ్గించడంతో గురువారం సూచీలు లాభాల మోత మోగించాయి. అన్నిరంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువత్తడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే  బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గురువారం ముగిసే సరికి రూ.138.54లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ఉద్దీపన చర్యల ప్రకటనతో నేడు సంపద రూ.145.36 లక్షల కోట్లకు పెరిగింది.
50 షేర్లలో 44లాభాల్లోనే:- 
నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని లిస్ట్‌ అయిన మొత్తం 50 షేర్లలో 44లాభాల్లోనే షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐషన్‌ మోటర్స్‌, హీరోమోటోకార్ప్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతి షేర్లు 13.50శాతం నుంచి 10.50శాతం లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, జీ లిమిటెడ్‌ టెక్‌ మహీంద్రా షేర్లు మాత్రం 3శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. You may be interested

మందగమనంపై సర్జికల్‌ స్ట్రైక్‌!

Saturday 21st September 2019

 పారిశ్రామిక రంగానికి బూస్టర్‌ డోస్‌... కార్పొరేట్‌ ట్యాక్స్‌ 22 శాతానికి తగ్గింపు సర్‌చార్జీ, సెస్సులతో కలిపి 25.17 శాతమే ఇంతకుముందు ఇది 30 శాతం... 15 శాతానికి మ్యాట్‌ తగ్గింపు కొత్తగా నెలకొల్పే తయారీ కంపెనీలకు పన్ను 15 శాతమే... ఆర్థిక పునరుజ్జీవానికి మోదీ సర్కారు సాహసోపేత నిర్ణయాలు ఖజానాకు 1.45 లక్షల కోట్లు తగ్గనున్న పన్ను ఆదాయం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగంలో గుర్తుండిపోయే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఊహించని కానుకతో కార్పొరేట్లను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కార్పొరేట్‌

భలే మంచి రోజు...కార్పొరేట్‌ పన్ను తగ్గింపుపై వ్యాఖ్యలు

Friday 20th September 2019

 కేంద్రప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి (అన్ని రకాల సర్‌చార్జీ, సెస్‌ కలిపి) 25.17 శాతానికి తగ్గించి మార్కెట్‌ వర్గాలను శుక్రవారం ఆశ్చర్యపరిచింది. ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు పొందే దేశీయ కంపెనీలు 25.17 శాతం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను, ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు పొందని దేశీయ కంపెనీలు 22 శాతం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను చెల్లించే విధంగా తాజాగా చర్యలను ప్రకటించింది. 22 శాతం స్లాబ్‌ను ఎంచుకున్న దేశీయ కంపెనీలు

Most from this category