News


12000 దిగువన ముగిసిన నిఫ్టీ

Tuesday 3rd December 2019
Markets_main1575369479.png-30031

  • 127పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
  • ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత
  • మరోసారి తెరపైకి అంతర్జాతీయ వాణిజ్య భయాలు

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మార్కెట్‌ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 127 పాయింట్లను కోల్పోయి 40,675.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12వేల దిగువున 11,994 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి మూడో రోజూ నష్టాల ముగింపు. బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే స్టీల్‌, అల్యూమినియంలపై టారీఫ్‌లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ట్రంప్‌ మంగళవారం ప్రకటించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఫలితంగా మెటల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. నేటి ప్రారంభం కానున్న ఆర్‌బీఐ పాలసీ సమీక్షా సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈసారీ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడికి తప్పలేదు. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 258పాయింట్లు నష్టపోయి 31,613.35 వద్ద స్థిరపడింది. వాటితో పాటు ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, అటో షేర్లు క్షీణించాయి. అయితే ఐటీ, రియల్టీ రంగ షేర్లకు మాత్రం స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరించింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూలత నెలకొన్నప్పటికీ.., నేడు మన సూచీలు స్వల్పలాభంతో మొదలయ్యాయి. సూచీల ర్యాలీకి సహకరించే అంశాలేవీ లేకపోవడంతో కొద్దిసేపటికే సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. ఇంట్రాడేలో ఒకదశలో నిఫ్టీ 88 పాయింట్ల మేర నష్టపోయి 11,960.05 వద్ద, సెన్సెక్స్‌ 248 పాయింట్లను కోల్పోయి 40,554.04 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మార్కెట్‌ మరో అరగంట ముగుస్తుందనే సమయంలో మిడ్‌క్యాప్‌ షేర్లకు కొద్దిగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఇంట్రాడే నష్టాలను పూడ్చుకోగలిగాయి. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 11,956.40 - 12,068.60 రేంజ్‌లో కదలాడగా, సెన్సెక్స్‌ 40,554.04 - 40,885.03 శ్రేణిలో కదలాడింది.

జీ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫ్రాటెల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 4.50శాతం నుంచి 7.50శాతం వరకు నష్టపోయాయి. ఇన్ఫోసిస్‌, కోటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, బజాజ్‌ అటో షేర్లు 1శాతం నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి. 
 You may be interested

క్వాలిటీ మిడ్‌క్యాప్స్‌ ర్యాలీ త్వరలో: కోటక్‌

Wednesday 4th December 2019

రానున్న త్రైమాసికాల్లో కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండడంతోపాటు ఆదాయాలు కూడా మెరుగుడాల్సిన అవసరం ఉందన్నారు కోటక్‌ సెక్యూరిటీస్‌కు చెందిన పీసీజీ బిజినెస్‌ హెడ్‌ ఆశిష్‌నందా. స్థిరమైన రికవరీ అంచనాలతో 2020లో మార్కెట్‌ గమనం ఆశాజనకంగా ఉందన్నారు. వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థ 2011 నుంచి మందగమనం ఎదుర్కుంటోందని, ప్రభుత్వం, ఆర్‌బీఐ ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకుల ప్రక్షాళన, బ్యాంకింగ్‌ రంగంలో తగినంత లిక్విడిటీ

టారిఫ్‌ పెంపుతో ఎయిర్‌టెల్‌కు ప్రయోజనం!

Tuesday 3rd December 2019

ఫిచ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోనీ టెలికం రంగంలోని ప్రైవేట్‌ ఆపరేట్లరంతా ఒక్కమారుగా టారిఫ్‌లను పెంచారు. పెరిగిపోతున్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేందుకు టారిఫ్‌లు పెంచాల్సివచ్చిందని కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెంపు సరాసరిన 25- 40 శాతం ఉన్నా, నిజమైన పెరుగుదల ఆయా కస్టమర్లు తీసుకొనే ప్లాన్లపై ఆధారపడి ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోనీ చెప్పారు. కస్టమర్లు అధిక డేటా వాడకానికి ప్రాధాన్యమిస్తారా? లేక అధిక టారిఫ్‌ చెల్లింపునకు

Most from this category