News


సెన్సెక్స్‌ 411, నిఫ్టీ 119 పాయింట్లు అప్‌

Friday 27th December 2019
Markets_main1577442809.png-30481

12250 చేరువలో ముగిసిన నిఫ్టీ
మూడు రోజుల నష్టాలకు ముగింపు 
రాణించిన బ్యాంకింగ్‌, అటో, అర్థిక రంగ షేర్లు 

జనవరి డెరివేటివ్‌ సిరీస్‌కు శుభారంభాన్ని పలుకుతూ, మూడు రోజుల నష్టాలకు చెక్‌పెడుతూ మార్కెట్‌ శుక్రవారం భారీ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో  ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు 1శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 411 పాయింట్ల లాభంతో 41,575.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119.25 పాయింట్లు పెరిగి 12,245.80 వద్ద ముగిసింది. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, బ్యాంకింగ్‌ రంగ షేర్లుకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.30శాతం లాభపడి 32,412.35 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో పాటు, ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ర్యాలీ సూచీల భారీ లాభాలకు కారణమయ్యింది.  అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో కుదిరిన తొలి ధపా ఒప్పందంపై ఇరు దేశాధ్యక్షులు సంతకాలు పెడతారనే అశావహ అం‍చనాలతో నేడు సూచీలు పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు బదిలీకావడానికి, రుణ లభ్యతను పెంచేందుకు గాను  ఆర్‌బీఐ మరోసారి ఆపరేషన్‌ ట్విస్ట్‌ ప్రక్రియను చేపడుతుందనే వార్తలతో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఒకదశలో సెన్సెక్స్‌ 448 పాయింట్లు పెరిగి  41,611.27 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 12,258.45 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి.

పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా షేర్లు 2.22శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌, బ్రిటానియా, ఇన్ఫ్రాటెల్‌, విప్రో, యస్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

అంతర్జాతీయ చార్ట్‌ల్లో భారత సూపర్‌ స్టాక్స్‌

Saturday 28th December 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే రాబడుల విషయంలో వెనుకబడినా.. మన దేశానికి చెందిన కొన్ని స్టాక్ట్స్‌ 2019లో మెరుగైన రాబడులతో అంతర్జాతీయ చార్ట్‌ల్లో చోటు సంపాదించాయి. అంతర్జాతీయంగా టాప్‌-10లో ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ చోటు సంపాదించాయి.    బీమారంగం ఎస్‌బీఐ లైఫ్‌ షేరు 2019లో 65.8 శాతం రాబడులు ఇచ్చి ‘బ్లూంబర్గ్‌ వరల్డ్‌ ఇన్సూరెన్స్‌ ఇండెక్స్‌’లో టాప్‌ స్టాక్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 64.2 శాతం రాబడులతో

ఐసీఐసీఐ రికార్డు...2వారాల గరిష్టానికి యాక్సిస్‌

Friday 27th December 2019

శుక్రవారం ట్రేడింగ్‌ తొలిదశలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు ర్యాలీ జరపగా, మధ్యాహ్న సెసన్‌లో ప్రైవేటు రంగ బ్యాంకులు దూకుడు ప్రదర్శించాయి. ఈ క్రమంలో ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.550,50 స్థాయిని చేరి సరికొత్త జీవితకాల రికార్డుస్థాయిని నమోదుచేసింది. మరో ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు శుక్రవారం 2వారాల గరిష్ట స్థాయిని తాకింది. నేడు ఎన్ఎస్‌ఈలో ఈ షేరు రూ.739.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

Most from this category