News


11,700 పైకి నిఫ్టీ

Tuesday 29th October 2019
Markets_main1572326644.png-29199

అటో, మెటల్‌ షేర్లకు విరివిరిగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటలోనే నిఫ్టీ ఇండెక్స్‌ 11700 స్థాయిని అందుకుంది. ఒకరోజు విరామం తర్వాత నేడు సెన్సెక్స్‌ 49 పాయింట్ల లాభంతో 39,300 వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 11,644 వద్ద మొదలయ్యాయి. దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలేవీ లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లల్లో నెలకొన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మెటల్‌, అటో షేర్లల్లో కొనుగోళ్లు ఎక్కువగా జరిపారు. అలాగే బ్యాంకింగ్‌, ఫార్మా, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్‌ 300 పాయింట్లు పెరిగి 39,549 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 11,715.50 వద్ద ఇంట్రాడే హైని తాకింది. ఉదయం గం.10:30లకు సెన్సెక్స్‌ 259 పాయింట్లు పెరిగి 39,509.17 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు లాభంతో 11,705.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే, మీడియా, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక రంగ షేర్లలో స్వల్పంగా అమ్మకాలు కనిపిస్తున్నాయి. టెల్కోల రాబడి నిర్వచనం, కేంద్రానికి లైసెన్సు ఫీజులపై చెల్లించాల్సిన జరిమానాను 4నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం భారతీ ఎయిర్‌టెల్‌ 4శాతం, వోడాఫోన్‌ ఐడీ షేర్లు 7శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మార్కెట్‌ వర్గాల అంచనాల కన్నా తక్కువగా క్యూ2 ఫలితాలను ప్రకటించడంతో టాటామోటర్స్‌ షేర్లు నేడు 16శాతం లాభపడ్డాయి. 



You may be interested

టాటామోటర్స్‌ టార్గెట్‌ పెంచిన బ్రోకరేజ్‌లు

Tuesday 29th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ప్రదర్శన చూపడంతో బ్రోకరేజ్‌లు టాటామోటర్స్‌ షేరు టార్గెట్‌ను పెంచాయి. అయితే కొందరు నిపుణులు మాత్రం కంపెనీ ఫలితాల్లో ఇంకా మెరుగుదల రావాల్సిఉందని అభిప్రాయపడ్డారు.  - కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను  రూ. 190 నుంచి 200కు పెంచింది.  - సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను రూ. 120 నుంచి రూ. 190కు పెంచింది.  - ఎడెల్‌వీజ్‌: హోల్డ్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ను రూ. 134

ఆల్‌టైం ​గరిష్ఠానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Tuesday 29th October 2019

షార్ట్‌పొజిషన్లు కవర్‌వుతుండడంతో పాటు, మొత్తంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై మార్కెట్‌ వర్గాలలో పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఉండడంతో ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం సెషన్‌లో కొత్త గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 10.43 సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విలువ 1.95 శాతం లాభపడి రూ. 1462.00  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 1,434.25 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్లో రూ. 1,445.50 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమై, రూ.

Most from this category