News


35వేల ఎగువకు సెన్సెక్స్‌

Tuesday 16th October 2018
Markets_main1539685349.png-21208

ఇన్వెస్టర్లు క్యూ2 ఫలితాలపై దృష్టి సారించి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మంగళవారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. బ్యాంకింగ్‌, అటో, ఫైనాన్స్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు ముచ్చటగా మూడోరోజూ లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 10600 పాయింట్లను అందుకుంది. సెన్సెక్స్‌ 35వేల ఎగువన ముగిసింది. చివరకు సెన్సెక్స్‌  297 పాయింట్ల లాభంతో 35,162 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 10,585 పాయిం‍ట్ల వద్ద ముగిశాయి. నిప్టీ బ్యాంకు ఇండెక్స్‌ 201 పాయింట్లు లాభపడి 25,589 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లోనే ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ దాదాపు 3శాతం ర్యాలీ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ సూచీలను ముందుండి నడిపించింది. సెన్సెక్స్‌ సూచీ 34,913 - 35,216 రేంజ్‌లో ట్రేడవ్వగా, నిఫ్టీ 10,525 - 10,605 స్థాయిలో ట్రేడైంది.
ఇన్ఫోసిస్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ, ఐషర్‌మోటర్స్‌, ఇండియబుల్స్‌ఫైనాన్స్‌ 1నుంచి 5శాతం నష్టపోగా, ఎస్‌బీఐ, టెక్‌మహీంద్రా, ఓఎన్‌జీసీ, అదానీపోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం 3శాతం నుంచి 4శాతం వరకు లాభపడ్డాయి.
మార్కెట్‌ విశేషాలు:-
-    ప్రైవేట్‌రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు ఇంట్రాడేలో 3శాతం లాభపడి రూ.322.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. కంపెనీ ఎండీ&సీఈవోగా సందీప్‌ బక్షీ నియమానికి ఆర్‌బీఐ ఆమోదం తెలపడం ఇందుకు కారణమైంది. చివరకు 2.50శాతం లాభంతో రూ.321ల వద్ద ముగిసింది.

-    అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోరంగ షేర్లైన స్పైస్‌జెట్‌, ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 3నుంచి 7శాతం లాభపడ్డాయి.
-    జీ మీడియా కార్పోరేషన్‌ ఈ క్యూ2లో అత్యుత్తమ ఫలితాలను నమోదుచేసింది. ఫలితంగా కంపెనీ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో 17శాతం లాభపడి రూ.29.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరకు 12శాతం లాభంతో రూ.28.40ల వద్ద ముగిసింది.

-    భారత్‌ ఎగుమతులు సెప్టెబంర్‌లో తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రభుత్వరంగానికి చెంది వివిధ కంపెనీల్లో బైబ్యాక్‌ నేపథ్యంలో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 3వారాల కనిష్టానికి పడిపోయింది. మంగళవారం 3బేసిస్‌ పాయింట్లు(0.7శాతం) పడిపోయి 7.17శాతానికి చేరుకుంది. ఈల్డ్‌ పడిపోవడం ఇది వరుసగా 5వ రోజు.



You may be interested

భారత మార్కెట్‌ ఆకర్షిస్తోంది!

Tuesday 16th October 2018

జేపీ మోర్గాన్‌ సీనియర్‌ మేనేజర్‌ రష్మీ గుప్తా ఇన్వెస్టర్లు అనవసర భయాలను పక్కనబెట్టి సరసమైన రేట్లకు స్టాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలని జేపీ మోర్గాన్‌ మనీ మేనేజర్‌ రష్మీ గుప్తా సూచించారు. వర్దమాన దేశాల మార్కెట్లు ఇప్పటివరకు పలు భయాలతో నెగిటివ్‌ సెంటిమెంట్‌తో కుంగిపోయిఉన్నాయన్నారు. ఈ భయాల కారణంగా వర్ధమాన మార్కెట్లలో వచ్చిన మంచి అవకాశాలను ఇన్వెస్టర్లు గుర్తంచడం లేదన్నారు. ఈ ఏడాది వర్దమాన మార్కెట్లు దాదాపు 17 శాతం

రూ.20,000 కోట్ల బైబ్యాక్‌ చేయండి!!

Tuesday 16th October 2018

ఆయిల్‌ కంపెనీలను కోరిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీల్లో తనకున్న వాటాలు విక్రయించి నిధుల సమీకరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.20,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ చేయాలని ఆయిల్‌ కంపెనీలకు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలు ఇంధన ధరల నిర్ణయంలో కలుగజేసుకోమంటూ ఆయిల్‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ప్రభుత్వ ద్రవ్యలోటును తగ్గించుకునే క్రమంలో పెట్రో, ఆయిల్‌ కంపెనీలు...ప్రభుత్వం వద్దనున్న వాటాను బైబ్యాక్‌ చేయడం

Most from this category