News


బుల్స్‌ హల్‌చల్‌ ...సెన్సెక్స్‌ 580 పాయింట్ల ర్యాలీ

Tuesday 29th October 2019
Markets_main1572345408.png-29210

4నెలల గరిష్టం వద్ద ముగిసిన సూచీలు 
మెరిసిన మెటల్‌, లాభాల బాటలో అటో షేర్లు
నెల గరిష్టానికి నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, నిఫ్టీ​ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 

మార్కెట్లో మంగళవారం బుల్స్‌ హల్‌చల్‌ కొనసాగింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇనెస్టర్లు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ 581.64 పాయింట్లు లాభపడి 39,831.84 వద్ద, నిఫ్టీ 159.70 పాయింట్లు పెరిగి 11,786.85 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఇప్పటివరకు కంపెనీలు ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడం, మందగించిన ఆర్థిక వ్యవస్థను మరింత ఉత్తేజపరిచేందుకు కేంద్రం మరిన్ని ఉద్దీపన చర్యలు చేపట్టనుందన్న వార్తలు వెలుగులోకి రావడంతో  మార్కెట్‌లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. ముఖ్యంగా అటో, మెటల్‌ షేర్ల ర్యాలీ సూచీలను పరుగులు పెట్టించాయి. వాటికి తోడు బ్యాంకింగ్‌, ఐటీ, ఫార్మా, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ షేర్లకు కూడా కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ర్యాలీ మరింత బలంగా జరిగింది. అయితే ఒక్క మీడియా రంగ షేర్లు మాత్రం స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  ఇంట్రాడే ఒకదశలో సెన్సెక్స్‌ 667 పాయింట్లు లాభపడి 39,917.01 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు పెరిగి 11,809.40 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంక్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 356 పాయింట్లు లాభపడి 29,873.05 వద్ద స్థిరపడింది.

సూచీల ర్యాలీకి కారణాలివే..!
సఫలం దిశగా సాగుతున్న అమెరికా చైనా వాణిజ్య చర్చలు:- 
అమెరికా చైనాల మధ్య జరుగుతున్న 16నెలల సుధీర్ఘ వాణిజ్య యు‍ద్ధానికి తెరపడే అవకాశాలు మెరుగయ్యాయి. అనుకున్న సమయం కంటే ముందుగానే బీజింగ్, వాషింగ్టన్ మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరవచ్చని సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. అయితే నిర్థిష్ట సమయాన్ని మాత్రం చెప్పలేదు. చైనా అమెరికా చెందిన 50బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అంగీకరిస్తే చైనాపై విధించే రెండో విడుత టారీఫ్‌లను ఎత్తివేసేందుకు అమెరికా అంగీకారం తెలిపింది. వాణిజ్య ఒప్పంద సఫలం అయ్యే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో సోమవారం అమెరికా మార్కెట్లు ఆల్‌టైం హైకి తాకగా, నేడు ఆసియా మార్కెట్లు 3నెలల గరిష్టం వద్ద ట్రేడైయ్యాయి.
మరోసారి ఉద్దీపన చర్యలు..?
మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కేంద్రం మరిన్ని ఉద్దీపన చర్యలు చేపట్టనుందని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి ఈక్విటీలపై పన్ను విషయంలో సంస్కరణలు చేపట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని తెలుస్తోంది.  ఈ మేరకు దీర్ఘకాలిక మూలధన పన్ను, సెక్యూరిటీస్‌ ట్రాన్జాక‌్షన్‌ టాక్స్‌, డివిడెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ పై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం సంయుక్తంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో నీతి ఆయోగ్‌ కూడా పాల్గోన్నట్లు తెలుస్తోంది. 

మార్కెట్‌ మెప్పించిన క్యూ2 ఫలితాలు:- 
ఇప్పటికి వరకు కంపెనీలు ప్రకటించిన క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో సెంటిమెంట్‌ బలపడింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన ఎస్‌బీఐ, టాటా మోటర్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్యూ2 ఫలితాలు అంచనాలకు మించిన నమోదయ్యాయి. క్యూ2లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల స్లిపేజ్‌ల తగ్గడంతో ఆస్తుల నాణ్యత మెరుగైంది. అలాగే టాటామోటర్స్‌ సైతం మార్కెట్‌ వర్గాల అంచనాల కంటే తక్కువగా నష్టాలను ప్రకటించింది. 

సాంకేతిక కారణాలు:- 
నిఫ్టీ ఇండెక్స్‌ ముహూరత్‌ ట్రేడింగ్‌ నాటి ఇంట్రాడే హై 11,714ని బ్రేక్‌ అవుట్‌ చేసింది. ఇది రానున్న రోజుల్లో నిఫ్టీ అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. ఇండెక్స్‌ 11,714 పైన కొనసాగితే జూలై 08నాటి బేరిష్‌ గ్యాప్‌ జోన్‌ 11,771-11,798 స్థాయి టార్గెట్‌ నిర్ణయించబడుతుంది. షార్ట్‌ టర్మ్‌ ట్రేడర్లు 11,790 స్థాయిలో ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవాలని మార్కెట్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. 

‘‘క్యూ2 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మార్కెట్లో లిక్విటిడి కొరత సమస్య తగ్గింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో గతకొంతకాలంగా వేధిస్తున్న ఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టాయి. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగపు షేర్లు ఆకర్షణీయమైన ధరలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా మార్కెట్లో రిస్క్‌ అసెట్‌ సామర్థ్యం పెరిగింది. అయితే వాల్యూవేషన్లు అధికంగా ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. ఓవరాల్‌గా రానున్న రోజుల్లో సూచీలు మరింత ర్యాలీ చేసే అవకాశం ఉంది.’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ అధికారి వినోద్‌ నాయర్‌ తెలిపారు.


మారుతి సుజుకీ, యస్‌బ్యాంక్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటామోటర్స్‌ షేర్లు 4.50శాతం నుంచి 16.50శాతం లాభపడ్డాయి.  జీ లిమిటెడ్‌, కోటక్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1శాతం నుంచి 9శాతం నష్టపోయాయి. You may be interested

రిలయన్స్‌, టాటామోటర్స్‌, పీఎస్‌యూ స్టాకులపై పాజిటివ్‌

Tuesday 29th October 2019

-హెమాంగ్‌ జాని, షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ‘గతంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుం‍చి డీమెర్జర్‌ జరిగిన తర్వాత స్టాక్‌ హోల్డర్లకు మంచి లాభాల్ని పొందారని, ఇప్పుడు కూడా రిలయన్స్‌ జియో డీమెర్జ్‌ మార్కెట్‌ వర్గాలను ఆకర్షిస్తోందని, ఈ కంపెనీ షేరు రీరేట్‌ అవుతుంది’ అని షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జాని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. ఆటో రంగం పుంజుకుంటోంది.. ఒకే రంగంలోని అధ్వాన్న ప్రదర్శన చేస్తున్న కంపెనీలు అంచనాల కంటే

ఎస్‌బీఐ షేరును ఏంచేద్దాం?

Tuesday 29th October 2019

బ్రోకరేజ్‌లు, నిపుణుల అంచనాలు, సూచనలు... సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం వివిధ బ్రోకరేజ్‌లు ఎస్‌బీఐపై బుల్లిష్‌గా మారాయి. బ్యాంకు షేరుపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి... 1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 390కి పెంచింది. పీఎస్‌యూల్లో ఎంచుకోదగిన షేరు. టెలికం రంగానికి ఎంత రుణాలిచ్చిందనేది ఒక్కటే రిస్కీ అంశం. సేవింగ్స్‌ డిపాజిట్స్‌ వృద్ధి 7 శాతానికి చేరడం విశేషం. క్రెడిట్‌ వ్యయాల కారణంగా ఎర్నింగ్స్‌ అంచనాలు తగ్గించింది. 2. హెచ్‌ఎస్‌బీసీ: కొనొచ్చు.

Most from this category