News


సెన్సెక్స్‌ లాభం 337 పాయింట్లు

Friday 6th September 2019
Markets_main1567765018.png-28242

  • నిఫ్టీ 10950 సమీపంలో ముగింపు
  • రాణించిన అటో, మెటల్‌, ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్లు

సూచీలు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 337 పాయింట్ల లాభంతో 36,981.77 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.10 పాయింట్లు పెరిగి 10,941.00 వద్ద ముగిసింది. అటో, మెటల్‌, ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. అక్టోబర్‌ నుంచి అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య తాజాగా వాణిజ్య చర్చలు పునఃప్రారంభం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 1శాతం వరకు దిగిరావడం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 16 పైసలు బలపడటం తదితర కారణాలు దేశీయ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఇంట్రాడేలో నిఫ్టీ ఇండెక్స్‌ 10,867.45 - 10,957.05 శ్రేణిలోనూ, సెన్సెక్స్‌ 36,727.66 - 37,012.98 రేంజ్‌లో కదలాడింది. మరోవైపు ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, రియల్టీ, ఫార్మా రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 
హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, సన్‌ఫార్మా, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టాటాస్టీల్‌, టెక్‌మహీంద్రా, మారుతి సుజుకీ షేర్లు 3.50శాతం నుంచి 4శాతం వరకు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, సన్‌ఫార్మా, యస్‌బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 4.50శాతం వరకు నష్టపోయాయి.



You may be interested

ట్రేడింగ్‌ బెల్స్‌ నుంచి టెక్నికల్‌ సిఫార్సులు

Friday 6th September 2019

షార్ట్‌టర్మ్‌కు 5 స్టాకులపై ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈఓ అమిత్‌గుప్తా అంచనాలు ఇలా ఉన్నాయి.. 1. పీఎన్‌బీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 65. డైలీ చార్టుల్లో రివర్సల్‌ సంకేతాలు ఇస్తోంది. కచ్ఛితమైన స్టాప్‌లాస్‌(రూ.58)తో కొనుగోలు చేయవచ్చు. వారం పదిరోజుల్లో టార్గెట్‌ సాధించే ఛాన్సులున్నాయి.  2. దిలీప్‌ బుల్డ్‌కాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 420. స్టాప్‌లాస్‌ రూ. 350. దీర్ఘకాలిక చార్టుల్లో నెగిటివ్‌గా ఉన్నా, డైలీ చార్టులో చిన్నపాటి ట్రెండ్‌ రివర్సల్‌ కనిపిస్తోంది. పది రోజుల

ఎకానమీ కన్నా ముందే మార్కెట్లో రికవరీ!

Friday 6th September 2019

తుషార్‌ ప్రధాన్‌  నిజ ప్రపంచానికి సంబంధించి జరగబోయే అంశాలను స్టాక్‌ మార్కెట్లు కాస్త ముందుగానే గ్రహించి అందుకు తగ్గట్లే ప్రవర్తిస్తుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. స్టాక్‌ మార్కెట్లు ఆయా అంశాలను డిస్కౌంట్‌ చేసేదాన్ని బట్టి సదరు అంశం పాజిటివ్‌గా ఉండొచ్చా? నెగిటివ్‌గా ఉండొచ్చా? అనేది చాలామార్లు గుర్తించవచ్చు. అందుకే స్టాక్‌మార్కెట్లను లీడింగ్‌ ఇండికేటర్లు అంటుంటారు. ఇందుకు తగ్గట్లే ఈ సారి కూడా ఎకానమీ కన్నా ముందే మార్కెట్లలో రికవరీ వస్తుందని హెచ్‌ఎస్‌బీసీ

Most from this category