News


సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 40,050–39,920

Monday 11th November 2019
Markets_main1573441449.png-29483

అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అమెరికా, బ్రెజిల్‌ సూచీలు కొత్త రికార్డుల్ని అందుకోగా, పలు యూరప్, ఆసియా సూచీలు నెలల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటికే కొత్త రికార్డు స్థాయిని చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రికార్డు గరిష్టస్థాయికి మరో 0.7 శాతం దూరంలో వుండగా, ఇండియా రేటింగ్‌ను మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం, అమెరికా–చైనాల ట్రేడ్‌ డీల్‌పై అనుమానాలు తలెత్తడంతో మార్కెట్‌ వెనక్కు మళ్ళింది. òఅధిక శాతం ట్రేడింగ్, పొజిషన్లు కలిగివుండే నిఫ్టీ ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిని దాటితేనే, ర్యాలీ మరింత కొనసాగే అవకాశం వుంటుంది. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
నవంబర్‌ 8తో ముగిసిన వారంలో చివరిరోజున బీఎస్‌ఈ సెన్సెక్స్‌  40,749 పాయింట్ల స్థాయి వద్ద మరో కొత్త రికార్డును నెలకొల్పి, అదే రోజున ఆ స్థాయి నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. తుదకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే   159 పాయింట్ల లాభంతో 40,324 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  సెన్సెక్స్‌ ప్రస్తుతం కొనసాగిస్తున్న అప్‌ట్రెండ్‌కు  40,050–39,920 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ వారం ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే సెన్సెక్స్‌ స్వల్పకాలిక కరెక్షన్‌కు లోనుకావొచ్చు. ఈ సందర్భంలో 39,800 పాయింట్ల వద్దకు, ఈ లోపున  39,500 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ వారం సెన్సెక్స్‌ తొలి మద్దతు శ్రేణిని పరిరక్షించుకోగలిగితే 40,680–40,750 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపైన  40,900 పాయింట్ల వరకూ పెరిగే ఛాన్స్‌ వుంటుంది.  

నిఫ్టీ తక్షణ మద్దతు 11,850–11,810 శ్రేణి
గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,000–12,100 మధ్యలో పలుదఫాలు నిరోధాన్ని చవిచూసి,  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 18 పాయింట్ల లాభంతో 11,908 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి 11,850–11,810 శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే 11,780 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 11,695 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.  ఈ వారం తొలి మద్దతు శ్రేణిని నిఫ్టీ పరిరక్షించుకుంటే 12,020–12,035 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపై నిఫ్టీ అల్‌టైమ్‌ గరిష్టం 12,103 పాయింట్ల స్థాయిని దాటే అవకాశాలుంటాయి. 



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Monday 11th November 2019

కోల్‌ ఇండియా, హిందాల్కో, బ్రిటినియా ఇండస్ట్రీస్‌, మదర్‌సన్‌ సుమి సిస్టమ్స్‌, ఆయిల్‌ ఇండియా, పంజాజ్‌ సింధ్‌ బ్యాంక్‌, మెట్రోపాలిన్‌ హెల్త్‌కేర్‌, శ్రేయా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఎస్‌జేవీఎన్‌, గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఆర్బన్‌ ఆఫ్‌షోర్స్‌, బలరాంపూర్ చినిమిల్స్‌, శంకర్‌ బిల్డింగ్‌ ప్రాడెక్ట్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌, బాంబే డైయింగ్‌, ఇండియా సిమెంట్స్‌, ఎన్‌హెచ్‌పీసీ, అదానీ పోర్ట్స్‌, మహానగర్‌ గ్యాస్‌ కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక

ఆర్థికాంశాలు, ఫలితాలే దిక్సూచీ..!

Monday 11th November 2019

సోమవారం పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ ఉత్పత్తి వెల్లడి మంగళవారం సీపీఐ ద్రవ్యోల్బణం, గురువారం డబ్ల్యూపీఐ గణాంకాలు కోల్ ఇండియా, హిందాల్కో, బ్రిటానియా, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, కాడిలా హెల్త్‌కేర్, ఆయిల్ ఇండియా, నాల్కో ఫలితాలు ఈవారంలోనే.. గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం సెలవు న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం

Most from this category