News


సెన్సెక్స్‌ నిరోధశ్రేణి 39,675-39,820

Monday 1st July 2019
Markets_main1561957505.png-26701

వాణిజ్య యుద్ధానికి సంబంధించి అమెరికా-చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదరడం, ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్‌తో భేటీకి ఆ దేశ భూభాగంలోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అడుగుపెట్టడం వంటి అంశాలకు ఈ వారం ప్రారంభంలో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించే అవకాశం వుంది. ఈ క్రమంలో భారత్‌ మార్కెట్లు ఎంతవరకూ పెరుగుతాయన్నది ఆసక్తిదాయకం. ఎందుకంటే ప్రపంచ పరిణామాలకంటే...ఈ వారంలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌పై అంచనాలే మన మార్కెట్‌ను కదల్చవచ్చు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పరిమితశ్రేణిలో కదులుతున్న మన మార్కెట్‌....బడ్జెట్‌ తర్వాత ఒక ట్రెండ్‌ను ఏర్పర్చుకుని, ఆ బాటలో వేగంగా పయనించవచ్చు. ఇక ప్రస్తుత సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూన్ 28తో ముగిసిన వారం ప్రధమార్థంలో 38,946 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో 39,817 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 201 పాయింట్ల లాభంతో 39,395 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో ఈ సోమవారం సెన్సెక్స్‌ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 39,675-39,820 పాయింట్ల శ్రేణి తొలుత అవరోధం కల్పించవచ్చు. ఈ శ్రేణిని అధిగమిస్తే 40,060 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఆపైన 40,320 పాయింట్ల వరకూ పెరగవచ్చు.   ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 50 రోజుల చలన సగటు (50 డీఎంఏ) రేఖ కదులుతున్న 39,005 పాయింట్ల స్థాయి తొలుత మద్దతును అందించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 38,825-38,570 పాయింట్ల శ్రేణి వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 38,000 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. 

నిఫ్టీ  నిరోధశ్రేణి 11,875-11,910 పాయింట్లు....
గత వారం 11,911-11,651 పాయింట్ల శ్రేణిలో గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 65 పాయింట్ల లాభంతో 11,789 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 11,875-11,910 పాయింట్ల శ్రేణి తొలుత నిరోధించవచ్చు. ఈ శ్రేణిని దాటితే 11,960పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఈ స్థాయి పైన ముగిస్తే, 12,100 పాయింట్లకు పెరగవచ్చు.  ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 50 డీఎంఏ రేఖ కదులుతున్న 11,705 పాయింట్ల స్థాయి తక్షణ మద్దతును అందించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,625-11,590  పాయింట్ల శ్రేణి వద్ద లభించబోయే మద్దతు స్థాయి కీలకం. ఈ స్థాయిని వదులుకుంటే 11,426 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. 



You may be interested

వారం వారీ సిప్‌ ఓకేనా ?

Monday 1st July 2019

ప్ర: నేను ప్రస్తుతం కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) కింద నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మొత్తాన్ని వీక్లి సిప్‌గా ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఈ విషయంలో మీ సలహా ఏమిటి ?  -సునీల్‌, విశాఖపట్టణం  జ: నెలవారీ సిప్‌ కన్నా, వారం వారీ సిప్‌ ఒకింత ప్రయోజనం కలిగించవచ్చు. అయితే నెలవారీ సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్‌ చేసినా, వారం వారీ సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్‌ చేసినా,

బడ్జెట్‌పైనే మార్కెట్‌ దృష్టి

Monday 1st July 2019

శుక్రవారం పూర్తిస్థాయి బడ్జెట్‌, గురువారం ఆర్థిక సర్వే అంచనాలను అందుకోలేకపోతే అమ్మకాల ఒత్తిడి ఉంటుందన్న సామ్కో ఆశాజనకంగా కొనసాగిన జి–20 సదస్సు, వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక తెర ముంబై: ఈఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ సర్కార్‌.. కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టాక 2019–20 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కౌంట్‌ డౌన్‌ ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న (శుక్రవారం) బడ్జెట్‌ను

Most from this category