News


సెన్సెక్స్ నిరోధశ్రేణి 39,435-39,620 పాయింట్లు

Monday 24th June 2019
Markets_main1561354350.png-26516

అమెరికా....వివిధ దేశాలతో జరుపుతున్న వాణిజ్య యుద్ధాలు, తాజాగా అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.  ఈ అంశానికి తోడు మన దగ్గర ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సంక్షోభం, కార్పొరేట్ డిఫాల్ట్లులు, కార్పొరేట్ దుర్వినియోగాలతో దేశీయ సూచీలు గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. కానీ, మరో రెండు వారాల్లో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో బడ్జెట్ ర్యాలీకి బీజం పడుతుందో ? లేక అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలాంశాలకు మార్కెట్ తలొగ్గుతుందో ?... చూడాల్సి ఉంది. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూన్ 21తో ముగిసిన వారంలో 800 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంత క్రితం వారంతో పోల్చితే, 258 పాయింట్ల నష్టంతో 39,194 పాయింట్ల వద్ద ముగిసింది. 14 ట్రేడింగ్ సెషన్ల నుంచి కేవలం 3.5 శాతం శ్రేణిలో ఒడిదుడుకులకు లోనవుతున్న సెన్సెక్స్ త్వరలో ఈ శ్రేణి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ వారం సెన్సెక్స్‌కు తొలుత  38,825-38,570 పాయింట్ల శ్రేణి వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 38,000 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 37,415 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. ఈ వారం తొలి మద్దతు స్థాయిని పరిరక్షించుకుంటే, 39,435-39,620 నిరోధశ్రేణి కీలకం. అటుపై 40,060 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఆపైన 40.320 పాయింట్ల వరకూ పెరగవచ్చు. 

నిఫ్టీ కీలక నిరోధశ్రేణి 11,805-11,845 పాయింట్లు...
గత వారం 11,843-11,625పాయింట్ల శ్రేణిలో గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 99 పాయింట్ల నష్టంతో 11,724 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వారం నిఫ్టీకి 11,625-11,590  పాయింట్ల శ్రేణి వద్ద లభించబోయే మద్దతు స్థాయి కీలకం. ఈ స్థాయిని వదులుకుంటే 11,426 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే, 11,260 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ వారం తొలి మద్దతు స్థాయిని పరిరక్షించుకుంటే, 11,805-11,845 పాయింట్ల నిరోధశ్రేణి  వద్దకు పెరగవచ్చు. అటుపైన 11,960పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఈ స్థాయి పైన ముగిస్తే, 12,100 పాయింట్లకు పెరగవచ్చు. 



You may be interested

ఫండ్స్‌తో లాభాలు వస్తాయా ?

Monday 24th June 2019

ప్ర: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, లాభాలు వస్తాయా? పదేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేస్తే, కనీసం బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ వడ్డీనే వస్తుందా ?  -పల్లవి, విశాఖపట్టణం  జ: నాకు తెలిసినంత వరకూ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులే పొందవచ్చు. ఏదైనా ఒక ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి లాభాలే ఆర్జించవచ్చు. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు

అంతర్జాతీయ అంశాలే దిక్సూచీ..!

Monday 24th June 2019

ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు నేపథ్యంలో ఒడిడుదుకులకు ఆస్కారం  ఇరాన్‌పై యుద్ధం విషయంలో వెనక్కి తగ్గిన అమెరికా జపాన్‌లో జరిగే జి–20 శిఖరాగ్ర సమావేశాలపై ఇన్వెస్టర్లు దృష్టి న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని గతవారంలో మార్కెట్‌ వర్గాలు ఆందోళన చెందగా.. వారాంతాన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయంపై వెనక్కి తగ్గినట్లు ప్రకటించి ఊరటనిచ్చారు. అయితే, ఇప్పటికీ ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉద్రిక్త

Most from this category