News


సెన్సెక్స్‌ మద్దతు శ్రేణి 39,320-39,090

Monday 8th July 2019
Markets_main1562561566.png-26881

బడ్జెట్‌ అంచనాలు, ప్రపంచ మార్కెట్ల సానుకూల పవనాల కారణంగా గతవారం తొలి నాలుగురోజులూ క్రమేపీ పెరిగిన మన మార్కెట్‌...బడ్జెట్‌ ప్రతిపాదనలు నిరుత్సాహపర్చడంతో వారంలో ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. మరోవైపు అమెరికాలో తాజాగా వెలువడిన జాబ్స్‌ డేటాతో ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గవన్న అంచనాల్ని ఏర్పర్చడంతో గత శుక్రవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ అంశాల ప్రభావం ఈ వారం ప్రారంభంలో మన మార్కెట్‌పై పడవచ్చు. అటుతర్వాత వెల్లడికానున్న కార్పొరేట్‌ ఫలితాలు సూచీలను ఒడుదుడుకులకు లోనుచేయవచ్చు. ఇక ప్రస్తుత సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూలై 5తో ముగిసిన వారంలో చివరిట్రేడింగ్‌ రోజున కేంద్ర బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా 40,032 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్, అటుతర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనై 39,441 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. గతవారంలో ఇవే గరిష్ట, కనిష్టస్థాయిలుకావడం గమనార్హం. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 118 పాయింట్ల లాభంతో 39,513 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్‌ ఏర్పర్చిన నిరుత్సాహం, ఆసియా మార్కెట్ల ప్రతికూలతతో ఈ సోమవారం సెన్సెక్స్‌ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైతే 39,320-39,090 పాయింట్ల శ్రేణి వద్ద లభించబోయే తక్షణ మద్దతు కీలకం. ఇదే శ్రేణి వద్ద 50 రోజుల చలన సగటు (50 డీఎంఏ) రేఖ కదులుతున్నది. ఈ శ్రేణిని కోల్పోతే  38,825-38,570 పాయింట్ల శ్రేణి వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 38,000 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. తొలి మద్దతుశ్రేణిని పరిరక్షించుకుంటే తొలుత 39,730 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన ముగిస్తే 39,980-40,032 పాయింట్ల శ్రేణి వరకూ పెరగవచ్చు. ఆపైన 40,320 పాయింట్ల వరకూ పెరగవచ్చు.   

నిఫ్టీ మద్దతుశ్రేణి  11,760-11,725 పాయింట్లు...
గత వారం 11,982-11,797 పాయింట్ల శ్రేణిలో గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 11,811 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వారం నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 11,760-11,725 శ్రేణి వద్ద కీలక మద్దతు లభిస్తున్నది. 50 డీఎంఏ కదులుతున్న 11,725 పాయింట్ల స్థాయిని కోల్పోతే డౌన్‌ట్రెండ్‌ వేగవంతమై 11,625-11,590  పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. ఈ శ్రేణిని వదులుకుంటే 11,426 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. ఈ వారం తొలి శ్రేణి వద్ద మద్దతును పొందగలిగితే నిఫ్టీ తొలుత 11,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 11,945-11,982 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ స్థాయి పైన ముగిస్తే, 12,100 పాయింట్లకు ర్యాలీ జరపవచ్చు.



You may be interested

నేరుగా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 8th July 2019

ప్ర: నేను గత నాలుగేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో మొత్తం 20కి పైగా ఫండ్స్‌ ఉన్నాయి. ఈ సంఖ్యను సగనికైనా తగ్గించుకొమ్మని మిత్రులంటున్నారు. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.  -సురేశ్‌, విజయవాడ  జ: మీ మిత్రులు చెప్పింది నిజమే. మీ పోర్ట్‌ఫోలియోలో ఫండ్స్‌ సంఖ్యను కనీసం నాలుగో వంతుకైనా తగ్గించుకుంటే మంచిది. ఈక్విటీలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే ఎలాంటి రాబడులు వస్తాయో, 3–4

కొనసాగుతున్న ఆటో షేర్ల పతనం

Monday 8th July 2019

బడ్జెట్‌లో ఆటో రంగానికి అనుకున్నంత చేయూత లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్ల పతనం కారణంగా సోమవారం (జులై 8) ట్రేడింగ్‌లో నిఫ్టీ ఆటో సూచీ 2.15 శాతం లేదా 168.90 పాయింట్లు నష్టపోయి ఏడాది కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 10.00 సమయంలో ఆటో ఇండెక్స్‌ సూచీ 7,680.20 పాయింట్ల వద్ద  ట్రేడవుతోంది.  హీరో మోటర్‌ కార్ప్‌ 4.09 శాతం, మారుతి 2.88 శాతం, అపోలో టైర్స్‌ 2.84 శాతం, మదర్‌

Most from this category