News


సెన్సెక్స్‌ కీలక అవరోధం 38,340

Monday 29th July 2019
Markets_main1564383399.png-27374

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారంలో జరపనున్న విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ, అమెరికా మార్కెట్‌ మినహా ఇతర ప్రధాన దేశాల సూచీల్లో జోష్‌ కన్పించడం లేదు. ఫెడ్‌ రేటు తగ్గింపుకంటే ట్రేడ్‌వార్స్‌, వినియోగ డిమాండ్‌ తగ్గడం తదితర అంశాలతో యూరప్‌, ఆసియా మార్కెట్లు సతమతమవుతుండగా, ఇందుకు తోడు కొన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలు నొప్పించడంతో మన మార్కెట్లో క్షీణత అధికంగా వుంది. వరుసగా మూడు వారాల్లో భారత్‌ సూచీలు 4.5 శాతం నష్టపోయాయి. మరోవైపు ఇప్పటివరకూ  కార్పొరేట్‌ ఫలితాలు వెల్లడించిన ప్రధాన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ మినహా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంక్‌ తదితర హెవీవెయిట్‌ షేర్లన్నీ లాభాల స్వీకరణకు లోనవుతున్నాయి. త్వరితంగా మార్కెట్‌ రికవరయ్యే అవకాశం లేదని ఈ హెవీవెయిట్‌ షేర్ల కదలికలు సూచిస్తున్నాయి. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూలై 26తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రమేపీ తగ్గుతూ, వారంలో చివరిరోజైన శుక్రవారం 37,690 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది.  చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే  454 పాయింట్ల నష్టంతో 37,883 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం ముగింపు లాభాల్ని ఈ వారం ప్రారంభంలో సెన్సెక్స్‌ కొనసాగిస్తే తొలుత 38,170 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన ముగిస్తే 38,340 పాయింట్ల కీలక నిరోధస్థాయికి చేరవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తేనే తదుపరి రిలీఫ్‌ర్యాలీ సాధ్యపడి 38,690 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ వారం రెండో నిరోధస్థాయిని దాటలేకపోతే తిరిగి డౌన్‌ట్రెండ్‌ కొనసాగే ప్రమాదం వుంటుంది. అటువంటి సందర్భంలో తొలుత 37,690 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా  37,415 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ లోపున 200 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 37,110 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. 

నిఫ్టీ కీలక నిరోధం 11,400...
క్రితం వారం బలహీనంగా ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రమేపీ తగ్గుతూ 11,210 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. గత శుక్రవారం మధ్యాహ్న సెషన్‌ తర్వాత కొంతవరకూ కోలుకుని,  చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 135 పాయింట్ల నష్టంతో 11,284 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రిలీఫ్‌ర్యాలీ కొనసాగితే తొలుత 11,360 పాయింట్ల  స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 11,400 పాయింట్ల స్థాయివరకూ పెరగవచ్చు. రానున్న రోజుల్లో ఈ స్థాయి నిఫ్టీని గట్టిగా నిరోధించే అవకాశాలు వున్నాయి. ఈ స్థాయిని దాటితేనే మార్కెట్‌కు కొంత స్థిరత్వం వచ్చి నిఫ్టీ క్రమంగా 11,550 పాయింట్ల వరకూ రిలీఫ్‌ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంటుంది. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, వారం ప్రధమార్థంలో బలహీనత కనపర్చినా 11,210 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభ్యమవుతున్నది. ఈ లోపున  200 డీఎంఏ కదులుతున్న 11,135 పాయింట్ల స్థాయివరకూ పతనం కావొచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 11,060-11,000 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు.You may be interested

ఫండ్స్‌? పీఎమ్‌ఎస్‌ ? దేనిని ఎంచుకోవాలి ?

Monday 29th July 2019

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌) ప్ర: నేను గత కొంత కాలం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ, నేరుగా షేర్లలోనూ ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేయడం కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని నాకనిపిస్తోంది. షేర్లలో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.35 లక్షలకు పెరిగాయి. వీటిని మెల్లగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మళ్లించమంటారా లేక పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌(పీఎమ్‌ఎస్‌)కి అప్పగించమంటారా ?  -కార్తీక్‌, బెంగళూరు  జ: షేర్లలోని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మ్యూచువల్‌

ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి

Monday 29th July 2019

- వడ్డీ రేట్ల నిర్ణయంపై మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం - డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్ ఫలితాలు ఈవారంలోనే.. - మౌలిక సదుపాయాల గణాంకాలు (బుధవారం), మార్కిట్‌ తయారీ పీఎంఐ డేటా (గురువారం) వెల్లడి ముంబై: గత వారాంతాన ఆగస్టు సిరీస్‌ తొలి రోజు ట్రేడింగ్‌ లాభాలను నమోదుచేసినప్పటికీ.. వారం మొత్తం మీద చూస్తే బేర్స్‌దే హవాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా,

Most from this category